అసెంబ్లీః ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రిని తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వైటీడీఏ పరిధిలోకి యాదాద్రి చుట్టు ప్రక్కల గ్రామాలు తీసుకువస్తునట్లు ఆయన తెలిపారు. టెంపుల్ సిటీ అభివృద్ధికి 250 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా కాటేజ్‌లు, పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. 5 వేల మంది భక్తులకు నిత్యాన్నదానం చేసేందుకు వీలుగా భోజనశాల ఏర్పాటు చేస్తున్నట్లు, యాదాద్రిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa