ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు మద్దతు ధర కల్పించడంలో సర్కార్‌ వైఫల్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2017, 12:48 AM

మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః వరంగల్‌ నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను కాంగ్రెస్‌ నేతలు సందర్శిం చారు. రైతులకు అందుతున్న మద్దతు ధరలపై ఆరా తీశారు. టిఆర్‌ఎస్‌ పాలనలో కనీస మద్దతు ధరలు రావడం లేదని పార్టీ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కందుల కు, మిర్చీకి మద్దతు ధరలు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. పేరుకు పెద్ద మాటలు చెప్పిన మోఢీ అమలు చేయడంలో మాత్రం విఫలమవుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదు రాషా్టల్ర ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాదిస్తుందని జోస్యం చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలలో ఉన్న భ్రమలు తొలిగిపోయా యన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ నేతలంతా కలిసి కట్టుగా ఉన్నామని రాబోయే ఎన్నికల లో పార్టీ విజయం సాదించడం ఖాయమన్నారు.


    రైతుల రుణమాఫీని అమలు చేయలేక చేతులెత్తేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పార్టీ నేతలు ఇవి శ్రీనివాస రావు, రాజనాల శ్రీహరి, కట్ల శ్రీను తదితరులు ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa