రెవెన్యూ, పోలీసుల దాడులు : 1400 లీటర్ల నూనె స్వాధీనం
పరిగి, మేజర్‌న్యూస్ : వికారాబాద్ జిల్లా పూడురు మండల పరిధిలోని మేడికొండ గ్రామ శివార్లలో పశువుల ఎముకలు, వ్యర్థపదార్థాలతో తయారీ చేస్తున్న నూనే తయారీ కేంద్రంపై గురువారం రెవెన్యూ, పోలీసులు దాడులు నిర్వహించి 1400 లీటర్ల నకిలీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. ఎంతో కాలంగా కొనసాగుతున్న ఈ నూనె తయారీ కేంద్రంపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రమే నామమాత్రంగా ఉండటానికి కారణం ఫ్యాక్టరీ యజమానికి ఓ రాజకీయ బడా నేతతో ఉన్న పరిచయమేనని స్థానికులు పేర్కొన్నారు. హైదరాబాద్-బీజాపూర్ అంతరాష్ట్ర రహదారికి కిలోమీటరు దూరంలో ఈ నూనే కేంద్రం కొనసాగుతుంది. ఎవ్వరికి అనుమానం రాకుండా నూనె తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ముందు భాగంలో మాడితోటను పెంచారు. అంతేకాకుండా ఫ్యాక్టరి చుట్టు ప్రక్కల సిసి కెమెరాలను ఏర్పాటు చేసి ఇతర రాషా్టల్రకు చెందిన కూలీలతో గుట్టుచప్పుడు కాకుండా పశువుల ఎముకలు, వ్యర్థపదార్థాలతో నూనెను తయాతీ చేసి హైదరాబాద్, కర్నాటక ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఎవ్వరైన ఫ్యాక్టరీ దరిదాపులకు వెళ్తే సిసి కెమెరాలలో చూసి సెక్యూరిటితో శునకాలను బయటకు వదులుతున్నారని దీంతో అటువైపు వెళ్ళేందుకు ఎవ్వరు సాహసించడం లేదని స్థానికులు అధికారులకు చెప్పారు. అయితే ఇన్నాళ్ళుగా గుట్టుచప్పుడు కాకుండా పశువుల ఎముకలు, వ్యర్థపదార్థాలతో నూనె తయారీ విషయం ఇటు రెవెన్యూ, అటు పోలీసులకు తెలియదా అంటే తెలిసినా ఫ్యాక్టరీ యజమానికి బడా రాజకీయ నేతతో ఉన్న సంబంధమే అధికారులను అటువైపు వెళ్లనీయకుండా చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడ ఈ ఫ్యాక్టరీని అక్కడి నుండి తరలించాలని స్థానికులు డిమాండ్ చేసినా అధికారులు తీసుకున్న చర్యలు నామమాత్రమే అయితే గురువారం నాడు పూడురు మండల తహశీల్దార్ సంగీతారాణి, పరిగి సిఐ ప్రసాద్ సంయుక్తంగా నూనె తయారీ కేంద్రానికి చేరుకుని అక్కడి వివరాలు సేకరించారు. అధికారుల దాడుల సమయంలో ఏడు డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 1400 లీటర్ల నూనెను గుర్తించారు. అంతేకాకుండా అదే సమయంలో పశువుల ఎముకలు, వ్యర్థపద్క్షార్థాలతో కూలీలు తయారు చేస్తున్న నూనెను గమనించారు. కల్తీ నూనెను తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ నూనె మాఫీయాపై అధికారులు చర్యలు తీసుకుంటారా లేక నామ మాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa