ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోదండరామ్‌ తీరును ప్రజలు గమనిస్తున్నారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2017, 12:52 AM

మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః టి జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ వ్యాఖ్యానించారు.


   గురువారం వరంగల్‌ జిల్లా టిఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించడమే ఆయన పనిగా పెట్టుకున్నారని అన్నారు.


         టి జెఎసి నేతలను పోలీసులు వేదిస్తున్నారని చేస్తున్న ఆరోపణలలో నిజం లేదన్నారు. కాకతీయ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం మల్కాపూర్‌లో 9.5 టిఎంసిలతో రిజర్వాయర్‌ నిర్మించేందుకు సర్కార్‌ నిర్ణయించడం అభినందనీయమన్నారు. దీని ద్వారా నగర ప్రజల దాహర్తి తీరుతుందని విశ్వాసం వ్యిక్తం చేశారు. ఇందుకోసం ప్రయత్నించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఆయన కృతగ్నతలు తెలిపారు. 


       ఉమ్మడి వరంగల్‌ జిల్లా అభివృద్ది కోసమే తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని జిల్లా పార్టీ అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. ఇందులో బాగంగా దేవాదుల ప్రాజెక్టు కోసం తుపాకుల గూడెం వద్ద బ్యారేజి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందన్నారు. ఎన్నికల లో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చేం దుకు ప్రభుత్వ ం కట్టుబడి ఉందన్నారు. ఈ విలేఖరుల సమావే శంలో కుడా ఛైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఎల్లావుల లలితా యాదవ్‌, కుమార్‌, పోగుల సుదా కర్‌, చింతం సదానందం తదితరులు పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa