ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పందించకుంటే సచివాలయం ఎదుట సమ్మె

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2017, 12:57 AM

-14 రోజులుగా నిరాహార దీక్ష చేసిన పట్టించుకొని కేసిఆర్‌ సర్కార్‌
-విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంతవరకు  టిజేఎసి మద్దతు
-విద్యార్థుల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం
-టి జేఎసి చైర్మన్‌ ప్రోపెసర్‌ కొదందరామ్‌

సంగారెడ్డి టౌన్‌, మేజర్‌ న్యూస్‌ :వ్యవసాయ ఇంజనిరింగ్‌ విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్‌ చేస్తూ గత 14 రోజుల నుండి జిల్లా  కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరహార దీక్ష చేస్తున్న  ప్రభుత్వం పట్టించుకోవడంలో విఫలమైందని టి.జేఎసి ప్రోపెసర్‌ కొదండరామ్‌ అన్నారు. గురువారం నాడు విద్యార్థులు చేస్తున్న  నిరహార దీక్షకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా కొందండరామ్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువులు చదివి పరీక్షలు రాసి ఉన్నత స్థాయికి ఎదిగే పిల్లలను ఇలా రోడ్డుపై బైఠటాయించడం దారుణమన్నారు. విద్యార్థుల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మరోసారి కొదండరామ్‌ గుర్తు చేశారు. తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేస్తే అణిచి వేయడం, కేసిఆర్‌ పాలనకు నియతృత్వానికి నిదర్శమన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌  పరిపాలనలో ప్రజలకు మేలు లేదు. విద్యార్థులకు ఉద్యోగాలు లేవు. అదికారులు పనితీరులో చులకన లేదు. ఇందుకా.. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అని మండిపడ్డారు. అగ్రికల్చర్‌ కోర్సు లేదనడం చోచనీయమని,  వ్యవసాయానికి సహాయపడే యాంత్రీకరణకు పరికరాల ద్వారా యంత్రాలను తయారు చేసే  ఇంజనిరింగ్‌ విద్యార్థులు  చదివిన… కోర్సులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చారు. కాని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదని విమర్శించారు. మన రాష్ట్రం మన పరిపాలనలో ఇదే ప్రజా స్వామ్యమని సూటిక ప్రశ్నించారు. భారత దేశంత వ్యవసాయ సపన్న దేశంగా చేయాలని ఉద్దేశంతో  కేంద్ర  ప్రభుత్వం ముందడుగు వేస్తున్న తరుణంలో వ్యవసాయానికి అనుభందమైన వ్యవసాయ ఇంజనిరింగ్‌ విద్యార్థులు  తమ తల్లి దండ్రుల కొరిక మేరకు వివిద కోర్సుల్లో ఆసక్తి ఉన్నప్పటికి వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు తమ వంతు కృషిగా ముందుకు వచ్చిన అన్యాయం జరుగుతుందని వ్యవసాయా ఇంజనీరింగ్‌ విద్యార్తులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిదర్శంగానే తమ సమస్యలు పరష్కరించాలంటూ వ్యవసాయ ఇంజనీరింగ్‌ విద్యార్థులు.. గత 14 రోజులుగా జిల్లా కలెక్టరేట్‌ ముందు నిరహార దీక్షలు చేపడుతూ తమ ఆవేధనను వెల్లబోసుకుంటున్న పట్టించుకున్న నాధుడే.. కరువయ్యారు. గతంలో విద్యార్థులా... అండతో బంగారు తెలంగాణ కోసం ఉవ్వేత్తున ఉద్యామన్ని సాగించిన  టీఆర్‌ఎస్‌ పార్టీ వారిని పావులు వాడుకున్నారు. తమకు ఏలాగైన న్యాయం జరిగి సమైంక్యాంద్రలో కలుగని ప్రయోజనాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో కలుగుతాయన్న ఆకాంక్షకు తమ ప్రాణాలు సైతం లేక్క చేయకుండా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. కొందరు విద్యార్థులు ఓంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహాత్యలు చేసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం మాజీ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ తెలంగాణ రాషా్టన్రికి అడ్డుపడి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో డి.శ్రీనివాస్‌ ఓడిపోవాలని ఉస్మానీయ విద్యార్థి ఇషాంత్‌రెడ్డి డిఎస్‌ ఓడిపోవాలని మైసమ్మకు మోక్కుకొని తన ఒంటిపై పెట్రొల్‌ పోసుకొని ఆత్మహాత్య చేసుకున్నారు. ప్రాణాలు తెగించి ఉద్యమం చేస్తే ఇప్పుడు విద్యార్థులు నిరహార దీƒ లు కొనసాగిస్తే..తెలంగాణ ద్రోహీ డి. శ్రీనివాస్‌ను రాజ్యసభకు పంపండం కేసిఆర్‌ నైజాన్ని వ్యక్త పరుస్తుందని విద్యార్థులు దుమ్మెత్తి పోస్తున్నారు. బంగారు తెలంగాణ  చేస్తానన్న కేసిఆర్‌...బాగుపడిని తెలంగాణ నను  చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం వ్యవసాయ యాంద్రికరణకు ఇరిగేషన్‌కు కోట్ల రూపాయులను విడుదల చేస్తుంది కాని ఏ ఒక్క శాఖలోనైన సంబంధిత చదువు చదివిన వారికి అర్హత కల్పించడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి కోర్సుకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో  విద్యార్థుల పక్షాన ఉండి ఏ ఉద్యమానికైనా సిద్దమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టి.జేఎసి ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షులు అశోక్‌, టి. జేఎసి రాష్ట్ర కార్యదర్శి బీరయ్య యాదవ్‌, టిజేఎసి నాయకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa