ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2017, 01:54 AM

హైదరాబాద్‌, సూర్యప్రధానప్రతినిధిః రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసు కువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుం టున్నదని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడి యం శ్రీహరి పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నో త్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కడియం జవాబిస్తూ...ప్రభుత్వ పాఠశా లలను మెరుగుపర్చేందుకు మూడు లక్ష్యాలను నిర్దేశించుక్నునామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం అడ్మిషన్లు చేపట్టడం, విద్యార్థులకు యూనిఫాం ఇవ్వడం, ప్రతీ పాఠశాలలో టాయిలెట్‌‌స నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ మూడు లక్ష్యాలను 2017, జూన్‌ 12 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ లక్ష్యాలు ఏ పాఠశాలలోనైనా అమలు కాని పక్షంలో తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. టాయిలెట్లను శుభ్రపరిచేందుకు ఇద్దరు వర్కర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa