ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 5 వరకు హెచ్‌సీయూలో దరఖాస్తుల స్వీకరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 26, 2018, 09:25 AM

హైదరాబాద్: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2018-19 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నదని వర్సిటీ పీఆర్‌ఓ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభమయిందని, మే 5వ తేదీ వరకు స్వీకరిస్తారని తెలిపారు. కాగా ఎంట్రెన్స్ పరీక్షలను జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ బయోకెమిస్ట్రీ, మాలిక్యులార్ బయోలజీ, నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఏ ఎడ్యుకేషన్, పీహెచ్‌డీ ఎడ్యుకేషన్, ట్రాన్స్‌లేషన్ స్టడీస్, పీజీ డిప్లొమా ఇన్ సంస్కృతి కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్‌ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వివరాలు http:// acad.uohyd.ac.in ద్వారా తెలుసుకోవచ్చన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com