ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ ‘కాటమరాయుడు’ దుస్తులు ఆన్‌లైన్‌లో అమ్మకం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2017, 12:15 PM

పవర్‌‌స్టార్ పవన్‌కల్యాణ్ ‘కాటమరాయుడు’ సినిమాలో ఉపయోగించిన టీషర్టులు, టవల్స్ ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచబోతున్నారు. పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రలో దర్డకుడు కిశోర్ పార్థసాని(డాలీ) కాటమరాయుడు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర బృందం పవన్ వాడిన దుస్తులను ఆన్‌లైన్‌లో అమ్మడానికి నిర్ణయించింది. ఇందుకోసం ఎకోరా అనే సంస్థతో చిత్ర నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ‘కాటమరాయుడు’ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటాయని సమాచారం. అయితే వీటిని కొనుగోలు చేసేవారు www.katamarayudustore.com అనే వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com