హిందూ వివాహ పద్దతిలో పెళ్ళి చేసుకున్న అనంతరం నూతన వధూవరులకు అరుంధతి నక్షత్రం చూపించడం ఆనవాయితి. అయితే పవన్ కళ్యాన్ అభిమాని పెళ్ళిలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. కర్ణాటకు చెందిన ఓ అభిమానికి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. పవన్ సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ షో చూడాల్సిందేనట. మరి పవన్ ని అంతగా అభిమానించే అభిమాని తన పెళ్ళి సమయంలో అరుంధతి నక్షత్రంకు బదులు పవన్ కళ్యాణ్ నే చూస్తానని పట్టుబట్టాడట. దీంతో చేసేదేం లేక పెద్దలు అప్పటి కప్పుడు పవన్ ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేశారట. నూతన దంపతులిద్దరు పవన్ ని చూస్తూ ఆనందభరితులయ్యారట. అయితే ఈ విషయం తెలిసి కొందరు నవ్వుకుంటుంటే, మరికొందరు ముక్కున వేలేసుకున్నారు. కాగా పవన్ కళ్యాన్ అభిమానులు మాత్రం దటీజ్ పవర్ స్టార్ అంటూ ఆనందపడుతున్నారట.