హైదరాబాద్: రాష్ట్ర రెండో రాజధానిగా పిలవబడే వరంగల్లో టీఆర్ఎస్ ప్లీనరీ జరగనున్నది. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం ప్రగతి భవన్లో వరంగల్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించారు. ఇందుకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని, నేతలకు కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు సమాచారం.