కమ్యూనిస్టులను చూసైనా కాంగ్రెస్ అధిష్టానం మేలుకోవాలి: కోమటిరెడ్డి

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 02:53 PM
 

హైదరాబాద్: ప్రజా సమస్యలపై పోరాడేందుకు జూన్ 2న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సభకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఆహ్వానిస్తామన్నారు. బహిరంగ సభ పెట్టడానికి పీసీసీపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కాదంటే నల్గొండలో సొంతంగా బహిరంగ సభ నిర్వహిస్తానన్నారు. కమ్యూనిస్టులను చూసైనా కాంగ్రెస్ అధిష్టానం మేలుకోవాలి సూచించారు.