ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరపిలేని వర్షం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 12, 2018, 10:16 AM

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలోని జూబ్లిdహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, కోఠి, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షానికి రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండడంతో ఉదయం నుంచి స్కూల్‌ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com