ట్రెండింగ్
Epaper    English    தமிழ்

48 గంటల్లో పలుచోట్ల ఓ మోస్తరు వానలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 11, 2018, 10:08 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రాంతంలో సముద్రమట్టానికి 5.8 కి.మీఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. ఉత్తర ఒడిశా, ఆ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటికితోడుగా రానున్న మూడ్రోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాగల 48 గంటల్లో తెలంగాణలోని పలుచోట్ల ఓ మోస్తరుగా, కోస్తా ఆంధ్రలో భారీగా వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపారు. 48 గంటల్లో గ్రేటర్‌లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com