ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడే తిరుమలకు తెలంగాణ ముఖ్య మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 07:10 AM

హైదరాబాద్‌: శ్రీవేంకటేశ్వరస్వామికి తెలంగాణ మొక్కులు తీర్చేందుకు ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం తిరుమలకు బయల్దేరనున్నారు. ముఖ్య మంత్రి వెంట ఆయన కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సల హాదారులు, అధికారులు వెళ్తున్నారు. సీఎం పర్యటనకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు సైతం భారీగా తరలి వెళ్తున్నాయి. పలువురు రోడ్డు మార్గంలో తిరుపతికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి మంగళ వారం సాయంత్రం తిరుపతి చేరుకుం టారు. కొండపైకి చేరుకొని రాత్రి తిరుమలలో బస చేస్తారు. బుధవారం ఉద యాన్నే తిరుమలేశున్ని దర్శించుకుంటారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa