రేణిగుంట: తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) మంగళవారం తిరుమల దర్శనార్థం రానున్న నేపథ్యంలో సోమవారం రేణిగుంట ఎయిర్‌పోర్టు మార్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్ల తొలగింపు వివాదాస్పదమైంది. మొక్కు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలసి తిరుమల రానున్న కేసీఆర్‌ను స్తుతిస్తూ తమిళనాడు తెలుగు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఎయిర్‌పోర్టు మార్గంలో ఫ్లెక్సీలను, రోడ్డు పక్కన వాల్‌పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదంటూ అధికారులు తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న కేతిరెడ్డి సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని తన అసంతృప్తి వెలిబుచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్ర సీఎంకు మనమిచ్చే అతిథి మర్యాద ఇదా అని ఆయన ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa