చెన్నై: ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వంపై అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించే సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడం చాలా దురదృష్టకరమని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు విశాల్ అన్నారు. కడలూరు జిల్లా పిచ్చావరం వద్ద ‘తుప్పరివాలన’ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న విశాల్ మీడియాతో మాట్లాడుతూ శాసన సభలో బలపరీక్షలో ఈపీఎస్ నెగ్గినా, ఓపీఎస్ గెలిచినా తమకు ఒరిగేదీ ఏమీలేదని అన్నారు. కరవుకోరల్లో చిక్కుకున్నా రాష్ట్రాన్ని, రైతాంగాన్ని కాపాడే నాథులే కరవయ్యారని తెలిపారు. ప్రస్తుత పాలకులైనా ఓటేసిన ప్రజలను ఆదుకుంటారని ఆశపడుతున్నానని విశాల్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa