హైదరాబాద్ : నిరుద్యోగ ర్యాలీ, సభ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనుమతి లేకున్నా ర్యాలీ సభ నిర్వహిస్తామని జేఏసీ ప్రకటించడంతో పోలీసులు అరెస్టుల పర్వానికి తెరతీశారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్ ను ఈ తెల్లవారు జామున అరెస్టు చేసి కామాటి పుర పోలీసు స్టేషన్ కు తరలించారు. అలాగే పలువురు జేఏసీ నేతలకు కూడా పోలీసులు ముందస్తుగా అదుపులోనికి తీసుకున్నారు. ఇందిరా పార్క్, సుందరయ్య విజ్ణాన భవన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa