హైదారాబాద్: నిరుద్యోగుల ర్యాలీ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణ నిరుద్యోగ సమస్యపై నేడు ర్యాలీ నిర్వహించాలని రాజకీయ ఐకాసా ఛైర్మన్ కోదండరామ్ పిలిపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన్ను బుధవారం తెల్లవారు జామున పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తూర్పుమండల డీసీపీ రవీంద్ర మాట్లాడుతూ ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం పదిగంటల సమయంలో ఉస్మానియా విద్యార్థులు వసతి గృహాల నుంచి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని లా కళాశాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మరోపక్క నిజాం కళాశాలలో విద్యార్థులు తగతులను బహిష్కరించి ర్యాలీ చేపట్టారు. దీంతో అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa