ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్క‌డ ప‌ని మ‌ధ్య‌లో గంట బ్రేక్ తీసుకొని..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 11:01 AM

స్టాక్‌హోమ్‌: స‌్వీడ‌న్‌లో ఓ టౌన్ కౌన్సిల‌ర్ ఓ వినూత్న ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తీసుకొచ్చారు. ఉద్యోగాలు చేసుకునేవాళ్లు ప‌ని మ‌ధ్య‌లో గంట బ్రేక్ తీసుకొని.. ఇంటికెళ్లి త‌మ పార్ట్‌న‌ర్స్‌తో సెక్స్ చేసి వ‌చ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌న్న‌ది ఆ ప్ర‌తిపాద‌న‌. ప‌ని ఒత్తిడి వ‌ల్ల దంప‌తులు స‌రిగా సెక్స్‌లో పాల్గొన‌డం లేద‌న్న‌ది ఆ కౌన్సిల‌ర్ అభిప్రాయం. స్వీడ‌న్‌లోని ఒవెర్టోనియా టౌన్ కౌన్సిల‌ర్ పెర్ ఎరిక్ ముస్కోస్ ఈ ప్ర‌తిపాద‌న‌ను తీసుకొచ్చారు. సెక్స్ ఆరోగ్యానికి మంచిద‌ని అధ్య‌య‌నాలు నిరూపించాయ‌ని ఈ సంద‌ర్భంగా ముస్కోస్ అన్నారు. 


ప‌ని మ‌ధ్య‌లో ఇలాంటి బ్రేక్స్ ఇవ్వ‌డం వ‌ల్ల ఉద్యోగులు మరింత ఉత్సాహంగా ప‌నిచేయ‌డంతోపాటు.. వ్య‌క్తిగత జీవితంలో కూడా వారి బంధాలు మ‌రింత బ‌ల‌ప‌డ‌తాయ‌ని ముస్కోస్ వాదిస్తున్నారు. అయితే ఈ బ్రేక్‌లో క‌చ్చితంగా ఉద్యోగి ఇంటికెళ్లి సెక్స్ చేస్తాడ‌ని చెప్ప‌లేమ‌ని, ఈ స‌మ‌యాన్ని వేరే ప‌నికి కూడా కేటాయించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. ఈ బిల్లు పాస్ అవుతుంద‌న‌డంలో త‌న‌కు ఎలాంటి సందేహం లేద‌ని ముస్కోస్ స్ప‌ష్టంచేశారు. ఇప్ప‌టికే యూరప్‌లో అతి త‌క్కువ గంట‌లు ప‌నిచేసిన ఉద్యోగ‌స్తుల్లో స్వీడ‌న్ మూడోస్థానంలో ఉంది. 2015లో ఆ దేశంలోని ఫుల్ ఉద్యోగులు స‌గ‌టున 1685 గంట‌లు మాత్ర‌మే ప‌నిచేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com