న్యూదిల్లీ: ఆర్‌బీఐ కొత్తగా రూ.1000 నోట్లు ముద్రిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ ఖండించారు. కొత్తగా రూ.1000 నోట్లు ముద్రించే ప్రణాళిక ఏదీ ప్రభుత్వానికి లేదని ఆయన తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం రూ.500, ఇతర చిన్ననోట్లను సరిపడా ముద్రించడంపై దృష్టిపెట్టిందని తెలిపారు. కొన్ని ఏటీఎంల్లో నగదు కొరత ఉంటోందన్న ఫిర్యాదులు వస్తున్న దృష్ట్యా ప్రజలు అవసరమైనంత వరకే విత్‌డ్రా చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa