ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎంకే పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 01:16 PM

చెన్నై: అసెంబ్లీలో ఏకపక్షంగా జరిగిన పళనిస్వామి బలపరీక్ష చెల్లదంటూ డీఎంకే వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ స్పందించింది. ఈ పిటిషన్‌పై విచారణను మద్రాస్ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల నిర్బంధంపై ఆధారాలు ఇవ్వాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై వీడియో ఫుటేజీని సమర్పించాలని కోర్టు సూచించింది. ఇదిలా ఉంటే, పళని సీఎంగా కొనసాగేందుకు అనర్హుడని డీఎంకే ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగింది. స్టాలిన్ ఒకరోజు దీక్షకు దిగారు. ఎమ్మెల్యేలను బలవంతంగా బెదిరించి ఓట్లేయించుకున్నారని పళనిపై స్టాలిన్ మండిపడ్డారు. అయితే డీఎంకే చేస్తున్న ఈ ఆందోళన వెనుక రాజకీయ కోణం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మేలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్టాలిన్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని విశ్లేషిస్తున్నారు. శశికళపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీకి లబ్ది చేకూర్చుతుందని డీఎంకే భావిస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa