న్యూఢిల్లీ:నగదు రహిత చెల్లింపుల్లో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తొలి ఐదు స్థానాల్లో చోటును దక్కించుకొన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల తర్వాతే ఢిల్లీ నిలిచింది. అయితే భీమ్ యాప్ కు రెఫరల్ ఆఫర్ ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం నగదురహిత చెల్లింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకుగాను కేంద్రం ప్రోత్సాహకాలను ,ప్రకటించింది. గత ఏడాది పెద్ద నగదునోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పెద్ద నగదునోట్లను రద్దుచేయడంతో నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకొంది. నగదు రహిత లావాదేవీల ప్రోత్సహం కోసం కేంద్రం పలు పథకాలను కూడ తీసుకొచ్చింది. వ్యాపారుల కోసం ప్రజల కోసం వేర్వేరుగా పథకాలను తెచ్చింది. నగదు రహిత లావాదేవీల్లో టాప్ లో తెలుగు రాష్ట్రాలు నగదు రహిత లావాదేవీల్లో అగ్రస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. మొదటి ఐదు స్థానాల్లోనే రెండు తెలుగు రాష్ట్రాలున్నాయి.ఈ రెండు రాష్ట్రాల తర్వాతే ఢిల్లీ నిలిచింది. నగదు రహిత లావాదేవీల్లో ప్రథమస్థానంలో మహరాష్ట్ర నిలిచింది. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు నిలిచింది. తమిళనాడు తర్వాత ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ తర్వాత స్థానంలో ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయని నీతి ఆయోగ్ సిఈఓ అమితాబ్ కాంత్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa