ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి పోచారం హైదరాబాద్ కు తరలింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 02:09 PM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. స్వామి వారి దర్శనానంతరం అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆయనను సమీపంలోని అశ్వని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఈ క్రమంలో, కొండపైనే ఉన్న అపోలో వైద్యుల బృందం కూడా అక్కడకు చేరుకుని ఆయనకు వైద్య సేవలు అందించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో, ఆయనను హైదరాబాద్ పంపించారు. ఆయన వెంట ఒక వైద్య బృందం కూడా వుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa