ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో నాలుగోవిడత పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రస్తుతం 53 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 12 జిల్లాల్లో ఈ పోలింగ్ ప్రారంభమైంది. 1.85 కోట్లు మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాయిబరేలీ, అలహాబాద్ వంటి స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగుతున్నాయి. కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి హమీర్‌పూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఛీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య అలహాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాయిబరేలీ కాంగ్రెస్ అభ్యర్థి సదర్ అదితి సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa