హైదరాబాద్ : ఓయూకు కేంద్రం నుంచి రూ.200కోట్ల నిధులు వచ్చాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఓయూలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో దత్తాత్రేయ మాట్లాడుతూ… ఓయూ చాలా ప్రఖ్యాత విశ్వ విద్యాలయమన్నారు. ఓయూకు 2014 నుంచి యూజీసీ ద్వారా రూ.165 కోట్ల నిధులు వచ్చాయన్నారు. నాన్ యూజీసీ ద్వారా రూ.35కోట్ల నిధులు వచ్చాయన్నారు. ఓయూకు భవిష్యత్‌లోనూ పెద్ద ఎత్తున నిధులు వచ్చేలా కృషి చేస్తామన్నారు.