హైదరాబాద్ : నిర్వాసితుల సమస్యలపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరామని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మరొకసారి ఢిల్లి వెళ్లి రాష్ట్రపతిని కలిసి నిర్వాసితుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళతామని కోదండరాం చెప్పారు. తమ నిరుద్యోగ ర్యాలీ సంపూర్ణ విజయం సాధించిందని ఆయన అన్నారు. తమను కలిసేందుకు వచ్చిన నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. విద్యార్థులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa