ట్రెండింగ్
Epaper    English    தமிழ்

`సమైక్య పాలనలోనే ప్రాజెక్టులపై నిర్లక్ష్యం'

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 12:50 AM

జనగామ,మేజర్‌న్యూస్‌: సమైక్యపాలనలోనే సాగునీటిరంగం నిర్లక్ష్యానికి గురైందని, తెలం గాణ ప్రభుత్వంలోనే మైనర్‌ ఇరిగేషన్‌శాఖకు ప్రత్యేకగుర్తింపు వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పేర్కొన్నా రు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో విలేకరులతో ఆయన మాట్లాడా రు. తెలంగాణలోని ప్రజలు ఎక్కువగా చెరువు లపై ఆధారపడి వ్యవసాయం చేస్తారన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయతో చెరువులు సంతరించుకున్నాయ న్నారు. ఈ ఏడాది చెరువుల కింద సాగు పెరిగిందన్నారు.ఈ సందర్భంగా భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుకు అభినందనలు తెలిపారు. చెరువుల్లో సమృద్ధిగా నీళ్లుంటేనే ఊరికి శుభం కలుగుతుందన్నారు. గ్రామాల్లో వ్యవసాయరంగంతో పాటు విద్యావ్యవస్థను పటిష్టం చేయాలన్నా రు. విద్య,వైద్యరంగాల అభివృద్ధితో జీవనవిధానంలో మార్పు వస్తుందన్నారు. సర్కార్‌బడులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa