ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్రా బ్యాంక్‌ సేవలు అమోఘం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 12:52 AM

 ఉచిత ఆరోగ్య శిబిరం  నిర్వహించడం అభినందనీయం  వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజేశ్వర్‌ తివారీ


హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి : ఆంధ్రా బ్యాంక్‌, ఖాతాదారులకు సేవలందిస్తూనే సామాజిక భాద్యతలో భాగంగా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం అభినం దనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ  రాజేశ్వర్‌ తివారీ అన్నారు. గురువారం ఆంధ్రా బ్యాంక్‌ సెక్రటేరియట్‌ శాఖ, యశోదా మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి,   తెలంగాణ సెక్రటేరియట్‌ ఉద్యోగుల సంఘం సంయుక్త అధ్వర్యంలో తెలంగాణ సచివాలయంలో  నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిం చారు. సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 10 మంది నిపుణులైన వైద్యుల బృందం పర్యవే క్షణలో కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ, ఎండోక్రైనా లజీ, జనరల్‌ మేడిషన్‌ విభాగాలలో సుమారు 800 మంది సచివాలయ ఉద్యోగులకు ఉచిత వైద్య పరిక్షలు నిర్వహించి సలహాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా బ్యాంక్‌ జోనల్‌ మేనేజరు శ్రీధర్‌ మాట్లాడుతూ, త్వరలో నిమ్స్‌ ఆసుపత్రికి ఒక అంబులెన్స్‌ను ఉచితంగా అదచేయను న్నామని, సామాజిక సేవా బాధ్యతలో ఆంధ్రా బ్యాంక్‌ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. యశోదా ఆసుపత్రి, మలక్‌ పేట్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డా. విష్ణు రెడ్డి నేతృత్వంలో  డా. రమేష్‌,  డా. యశ్విన్‌, డా. ప్రశీత్‌, డా. వినయ్‌, డా. కవిత, డా. వినీత వైద్య పరిక్షలు నిర్వ హించారు.  ఆంధ్రా బ్యాంక్‌ సెక్రటేరియట్‌ శాఖ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ చందామరై  పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఆరోగ్య శిబిరంలో తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్‌ సెక్రటరీ షేక్‌ యూసఫ్‌ మియా,వైస్‌ ప్రెసి డెంట్‌ శ్రీమతి మంగమ్మ, అధికారులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa