ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కురవికి సిఎం కెసిఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 12:53 AM

మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం మహబూబాబా ద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పడితే కురవి వీరభద్రస్వామికి కోరమీసాలు సమర్పిస్తానని ఆయన మొక్కుకున్నారు. రాష్ట్రం ఏర్పడి టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో ఆయన మొక్కులు తీర్చుకంటూ వస్తున్నారు. శుక్రవారం మహశివరాత్రి పర్వదినం కావడంతో కెసిఆర్‌ స్వామి వారికి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ రోజు ఉద యం పదిన్నరకు హెలిక్రాప్టర్‌ ద్వారా కురవికి చేరుకుం టారు. అక్కడి నుండి నేరుగా దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దాదాపు రెండు గంటల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. అనంతరం డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ సొంత ఊరైనా ఉగ్గంపల్లికి చేరుకుంటారు. అక్కడే మధ్యహ్న బోజనం చేస్తారు. అనంతతరం తిరిగి హెలిక్రాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సిఎం తొలిసారిగా మానుకోట జిల్లాకు వస్తుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏరపాటు చేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa