ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేసవిలో తాగునీటికి ఇబ్బందులుండరాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 12:55 AM

సమగ్ర యాక్షన్‌ప్లాన్‌ రెడీ చేయండి


 వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇంజనీర్లకు ఇఎన్‌సీ ఆదేశాలు


హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి : వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులుండొద్దని, అందుకు అన్ని చర్యలు తీసుకోవాలని గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ బి.సురేందర్‌రెడ్డి జిల్లా ఇంజనీర్లను ఆదేశించారు. రాష్ట్రంలో శాశ్వతంగా తాగునీటి ఎద్దడిని నివారించేందుకు మిషన్‌భగీరథ పను లు జోరుగా సాగుతున్నాయని, ఇంకా వేగం పెంచాలన్నారు. ఓ వైపు  మిషన్‌ భగీరథ పనులు చేస్తూనే మరోవైపు వేసవికోసం సమగ్రమైన యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని ఇంజనీర్లను ఆదేశించారు. మిషన్‌ భగీరథ పనుల పురో గతిపై ఎర్రమంజిల్‌లోని కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఈఎన్‌.సి, మార్చ్‌ చివరినాటికి సాధ్యమైనన్ని ఆవాసాలకు భగీరథ నీళ్లు అందిం చేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో చేపట్టిన తాగునీటి పథకాల పురోగతి, అమలుపై  జిల్లా ఎస్‌.ఈలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసారి ఎండలు ఉదృతంగా  ఉండే అవకాశం ఉందని, అం దుకు తగ్గట్టుగా నీటి వనరులను ఎంపిక చేసుకుని ఆవాసాలకు అంతరాయం లేకుండా మంచినీటిని సరఫరా చేయాలని సూచించారు. స్వఛ్చ భారత్‌లో భాగంగా జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ఎలా సాగుతున్నాయో ఈఎన్‌.సి అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లను ఉపయోగించడంపై ప్రజల్లో విస్తౄఎతంగా అవగాహన కల్పించాలన్నారు. సురక్షిత తాగునీరు, సురక్షిత పరి సరాలే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. ఆ తర్వాత మిషన్‌ భగీరథ పనుల పురోగతిపై జిల్లాల వారీగా సమగ్రంగా సమీక్షించారు. ఇంటెక్‌ వెల్‌ నిర్మాణాల పూర్తయినందున, ఇక పైప్‌ లైన్‌ పై మరింత దౄష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ భూముల్లో పైప్‌లైన్‌లు త్వరగా వేయాలన్నారు. హెడ్‌ వర్క్స పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయో ఈఈలను అడిగితెలుసుకున్నారు. ఎక్కడైనా పను లు నెమ్మదిగా జరుగుతన్నాయనిపిస్తే సంబంధిత వర్క్‌ ఏజెన్సీలతో మాట్లాడి లేబర్‌ ను పెంచేలా ఒత్తిడి తేవాలన్నారు. వర్కింగ్‌ ఎస్టిమేట్స్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు ఈ సంవత్సరం డిసెంబర్‌ నాటికి ప్రతి ఆవాసానికి సురక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి పనిచేయాలన్నారు. ఇంట్రా పనులు త్వరగా పూర్తి కావడానికి సంబంధిత ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. మార్చ్‌ నాటికి హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స పరిధిలోని అన్ని నియోజకవర్గా లకు భగీరథ నీటిని అందించాలన్నారు.  శివరాత్రి, ఏడుపాయల, వేములవాడ జాతరలలో భక్తుల కోసం తాగునీటి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో  ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్‌, మిషన్‌ భగీరథ చీఫ్‌ ఇంజనీర్లు సురేష్‌ కుమార్‌, జగన్మోహన్‌ రెడ్డి,కృపాకర్‌ రెడ్డి, ఎస్‌.ఈ వినోభాదేవి, కన్సల్టెంట్లు నర్సింగరావు, నందరావు, మనోహర్‌ బాబు, శ్రీనివాస్‌ రెడ్డి తోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa