-ప్రచారమే తప్ప ఆచరణలో శూన్యం
-సిఎల్‌పి నేత జీవన్‌రెడ్డి
కరీంనగర్-సూర్యప్రత్యేకప్రతినిధి : ముఖ్యమంత్రి కేసిఆర్ రాషా్టన్న్రి అప్పుల ఊబిలోకి నెట్టుతున్నారని ప్రచారంలోకి చూపిన ప్రతిభ పనుల్లో చూపించడం లేదని సిఎల్‌పి ఉపనేత జగిత్యాల శాసన సభ్యులు తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వేములవాడ నియోజకవర్గ స్థాయి జన ఆవేదన సమ్మెలనం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగం కుమార్ అధ్యక్షతణ గురువారం చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్బంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతు తెరాసా ప్రభుత్వం ప్రకటనలకే పరిమిత మైనదన్నారు. మన ఊరు ప్రణాళిక . గ్రామజ్యోతి కార్యక్రమాలను ఆర్బాటంగా ప్రారంభించింది. అడ్రస్ లేకుండా చేశారన్నారు. కుల వృత్తుల వారిని మోసం చేసేందుకే ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘన సోనియా గాంధీ దేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒక లక్షల ముపైఏడు వేల ఉద్యోగాలు కాలిగా ఉన్న భర్తి చేయడం లేదన్నారు. ఇందుకోసం నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపడితే అరెస్టు చేయడం ఎంత వరకు సభభని అన్నారు. భారత పౌరసత్వం లేకున్న రమేష్‌బాబు శాసన సభ్యునిగా గెలవడం దురదృష్టకరం అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపి వినోద్‌కుమార్ గ్రామాల్లో పర్యటించకపోవడం శోచనియం అన్నారు. కేసిఆర్ 60వేల కోట్ల అప్పులు చేసి తెలంగాణ ప్రజలపై భారం వేశాడన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. కేసిఆర్ తెలంగాణ ప్రధాన ఆలయం వేములవాడ రాజన్న ఆలయాన్ని మరిచి తిరుపతికి వెళ్లి ముడుపులు చెల్లించడం ఎంత వరకు సమంజసం అన్నారు.
కేసిఆర్ మొక్కులు తెలంగాణ కోసం కాదని ముఖ్యమంత్రి కోసమే మొక్కులని గుర్తు చేశారు. పిసిసి ఉపాద్యాక్షులు పొన్న ప్రభాకర్ మాట్లాడుతు ప్రధాన నరేంద్రమోడి 86లక్షల కోట్ల నల్లదనాన్ని భయటకు సి పేదల ఖాతాలోకి 15లక్షలు వేస్తామని చెప్పిన ప్రకటనను ఏమైందని అన్నారు. డిజిటలేషన్ నగదు రహిత కోసం సేవలపై 25శాతం కమిషన్ బడబాబుల జేబులోకి చేరుతుందని అన్నారు. ఇసుక వ్యాపారం కేసిఆర్ కుటుంబ సభ్యులకే దక్కిందని దీనితో సామాన్యం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో దళితులకు భూ పంపిణి నిరుపేదలకు డబుల్ బెడ్‌రూంలు ఇచ్చిన దకాలాలు లేవని కేసిఆర్ ఆన నివాసం కోసం 110 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్యపాన నిషేదాన్ని అమలు చేస్తామన్నారు. నేడు రాష్ట్రంలో మధ్యం ఎరులై పారుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజి చైర్మేన్ ఎనుగు మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాగి శేఖర్, చిలుక బాబు, మారంపెల్లి లక్ష్మి, చంద్రశేఖర్, ముస్కు పద్మ,సత్యలక్ష్మి,బొడిగె అనిల్, బానాల రవిందర్‌రెడ్డి, తోట్ల అంజయ్య, వెంకటస్వామి, సత్యనారాయణ, అవారి రమేష్, చేపూరి గంగాదర్, కట్కం మల్లెశం, కటుకూరి చంద్రయ్య, కనకరాజులతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa