హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీ ఆర్ తాను మొక్కుకున్న మొక్కులు తీరుస్తున్నారని అలాగే ప్రజల మొక్కులు కూడా తీర్చాలా? వద్దా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు కనీస విద్యా, వైద్య సౌకర్యాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్ ప్రజాధ నాన్ని దుబారా చేస్తున్నారని తమ్మినేని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న కేసీఆర్ ఏం పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెం డున్నరేళ్లు పూర్తయినా రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం అన్నారు. నిరుద్యోగుల సమస్యలను గాలికొదిలేసిన కేసీ ఆర్ నిరుద్యోగ ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచే టని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కును కూడా కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తుందని తమ్మి నేని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా, వైద్య సౌకర్యాలు అధ్వాన్నంగా ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్య దర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ పాలనలో పేదలకు కనీస సౌకర్యాలు కూడా లభించ డం లేదని తమ్మినేని అన్నారు. ప్రజల సొమ్మును దుబా రాగా ఖర్చు చేస్తున్న కేసీఆర్ ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని తమ్మినేని ప్రశ్నించారు. తమ్మినేని యాత్ర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మేలుకొలుపుయాత్ర అని, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు సీపీఎం పార్టీ పూనుకోవడం అభినందనీయమని రాష్ట్రంలోని బడుగు,బలహీనవర్గాల కుల సంఘాలు, రాష్ట్రంలోని పలు విపక్షపార్టీలు సైతం కొనియాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ బాగుండేలా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న సీపీఎంతో అన్ని పార్టీలు కలిసిరావాల్సిన అవసరం ఉం దని పాదయాత్ర బృంధంసభ్యుల జాన్‌వెస్లీ అన్నారు. జనా భాలో 93 శాతం ఉన్న బడుగు, బలహీన, ఎస్సీ,ఎస్టీ బీసీ వర్గాల ప్రజలకు ఈ ప్రభుత్వాలు న్యాయంచేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలే పాలకులుగా మారేందుకు కులాలకతీతంగా ఐక్యం కావాలని జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు.
130 రోజులు పూర్తి : ఎర్రజెండా చేతబట్టి ప్రజలందిరినీ చైతన్యవంతం చేస్తున్న సీపీఎం మహాజన పాదయాత్ర 130 రోజులు పూర్తి చేసుకుంది. ఖమ్మం జిల్లా పర్యటనను పూర్తి చేసుకుని సూర్యాపేట జిల్లాలోకి అడుగుపెట్టిన తమ్మి నేని బృందానికి అపూర్వ స్వాగతం లభిస్తున్నది.