ఉప ముఖ్యమంత్రిని కోరిన ఎంపీ కవిత
సానుకూలంగా స్పందించిన కడియం
పాత భవనాల్లో కొనసాగుతున్న కాలేజీలు, స్కూళ్లకు కొత్త భవనాలు నిర్మించాలి
హైదరాబాద్, మేజర్‌న్యూస్ : నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలే జీలు, రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం ఎంపీ కవిత, ఎమ్మె ల్యేలు చేసిన విజ్ఞప్తి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సానుకూలంగా స్పందించారు. వెంటనే పాఠశాలలు, కాలేజీల్లోని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ స్పెషల్ సీ.ఎస్ రంజీవ్ ఆర్. ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ లను ఆదేశించారు. నిజామా బాద్ పార్లమెంటరీ నియోజక వర్గ పరిధిలో ప్రభుత్వ పాఠ శాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, రెసిడెన్షి యల్ స్కూళ్లు కొత్తవి మంజూరు కోరుతూ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్, బిగాల గణేష్, బాజీరెడ్డి గోవర్ధన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సంజీవరావు, విద్యాసాగర్ రావులు, రాష్ట్ర ఉఫ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో సచివాలయంలోని ఆయన చాంబర్‌లో సమావేశమ య్యారు. అదే విధంగా కొన్ని పాఠశాలలను అప్ గ్రేడ్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించేం దుకు నిధులు విడుదల చేయాలన్నారు. పాత భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, కాలేజీలకు కొత్త భవనాలు నిర్మించాలని అడిగారు. స్థానికంగా తాము నియోజక వర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఇంగ్లీషు మీడియం పాఠ శాలకు అనుమతులు ఇప్పించాలనే డిమాండ్ తీవ్రంగా ఉందని ఎంపీ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి దృష్టికి తీసు కొచ్చారు. గ్రామసభల్లో తెలుగు మీడియం ప్రభుత్వ పాఠ శాలలను ఇంగ్లీషు మీడియంకు మార్చేందుకు అనుమతిం చాలని, వీలు కాని పక్షంలో కొత్త స్కూళ్లను మంజూరు చేయాలని కోరారు. మైనారిటీ పాఠశాలలు, కాలేజీలకు ప్రత్యేక సాయమందించాలన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు నడుపుతున్న కాలేజీలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వాటిని నడిపించాలని కోరారు. ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ తప్పనిసరి చేసి ఫలితాల్లో కొంత వెయిటేజీ మార్కులు ఇవ్వాలని కవిత కోరారు. నిజామాబాద్ పార్ల మెంటరీ నియోజక వర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల పటిష్టత కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి రావ డంపై కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. జిల్లాకు సం బంధించి తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు వీలైనంత వరకు వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద కొన్ని నిధులు, ఎమ్మెల్యే ఫండ్స్ కొన్ని కలిపితే తాము ప్రభుత్వం నుంచి మరికొన్ని నిధులు కలిపి కొత్త భవనాలు మంజూరు చేస్తా మన్నారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ కోసం ఇప్పటికే నిధులు మంజూరు చేశామని వివరించారు. టాయిలెట్స్ నిర్వహణ కోసం ప్రతి హైస్కూల్‌కు ఏటా లక్ష రూపాయల గ్రాంట్‌ను ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్, ఫర్నిచర్ ఉండాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు ఎక్కడా కూడా జాప్యం లేకుండా ఇప్పటికే నిధులు విడుదల చేశామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశా లలు ప్రారంభం అయ్యే నాటికి ప్రతి పాఠశాలకు ఉచితపు స్తకాలు, యూనిఫాంలు, స్కూల్ గ్రాంట్లు అందించాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. పాఠశాలలో నమోదు పెంచ డంలో ఎమ్మెల్యేలు కూడా తమ వంతు పాత్ర పోషించాల న్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను అప్పుడ ప్పుడు తనిఖీ చేసి, అక్కడ మధ్యాహ్న భోజన వసతులు ఎలాఉన్నాయి, ఉపాధ్యాయులు హాజరు,విద్యార్థుల ఇబ్బం దులు కూడా అడిగి తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవు తుందని, ప్రభుత్వం మౌలిక వసతులు వేల కోట్ల రూపా యలు వెచ్చించి ఏర్పాటు చేస్తోందని, వాటిని సరైన రీతిలో వినియోగించుకునేందుకు, నిర్వహించేందుకు మంచి విద్య ఉన్నప్పుడే సాధ్యమవుతుందన్నారు. పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని, కాలే జీలు, పాలిటెక్నిక్ కాలేజీలలో ఎన్‌సీసీని తప్పనిసరి చేసే అంశాన్ని కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలు నిర్వహిం చినప్పుడు విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa