ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌లో ఒంటరి పోరు సాగిస్తున్న కోమటిరెడ్డి సోదరులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 01:06 AM

 -నల్గొండ కాంగ్రెస్‌ పార్టీలో భగ్గుమన్న విభేదాలు


  -పిసిసి చీఫ్‌గా ఉత్తమ్‌ను వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్‌‌స


  -అందరిని కలుపుకుని వెళ్లడం లేదంటున్న వ్యతిరేక వర్గం


  -ఉత్తమ్‌ సర్వే తరువాత తారస్థాయికి చేరిన మాటల యుద్ధం


  -భువనగిరి నుండి అసెంబ్లీకి పోటీచేసేందుకు రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నం


  -కాంగ్రెస్‌ నేతలతోనే పోరు సాగిస్తున్న కోమటిరెడ్డి సోదరులు


  -పొమ్మనలేక పొగబెడుతున్న ఉత్తమ్‌, జానారెడ్డి


  -టిఆర్‌ఎస్‌లోకి రాకుండా అడ్డుకుంటున్న మంత్రి జగదీశ్‌రెడ్డి


మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః  రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అంతో ఇంతో బలంగా ఉన్న నల్గొండ జిల్లాలోను ఆ పార్టీని బలహీన పరచాలని టిఆర్‌ఎస్‌ వేస్తున్న ఎత్తుగడలు ఫలిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో రెడ్డి నాయకుల మద్య విబేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలలో రోజు రోజుకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. ప్రతిపక్ష పార్టీని నడపాల్సిన తీరులో ప్రస్తుత కాంగ్రెస్‌ పెద్దలు నడపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికి కూడ కాంగ్రెస్‌ నేతలు తాము అధికారంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణానికి కృషి చేయడంలో నాయకత్వం వైఫల్యం కొట్టచ్చినట్టుగా కనపడుతోందని పలువురు సీనియర్‌ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, సోనియాగాంధీ ఇమేజ్‌ రోజు రోజుకు రెట్టింపు అవుతుంటే స్థానిక నాయకులు మాత్రం దానిని క్యాష్‌ చేసుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే గులాబీ గూటికి చే రుకోగా రేపో మాపో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు లతో పాటు పలువురు నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్దమైనట్టు సమాచారం. ఓ వైపు రాష్ట్రంలో  టిఆర్‌ఎస్‌ తో పాటు బిజెపిలు తమ పునాదులను పటిష్టం చేసుకుంటుంటే కాంగ్రెస్‌ నేతలు మాత్రం మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా, భవిష్యత్‌లో అధికారంలోకి వచ్చే పార్టీగా చేయాల్సిన కార్యక్రమాలను చేయడంలో టి కాంగ్రెస్‌ నేతల వైఫల్యాలు కొట్టచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. మరోవైపు టిఆర్‌ఎస్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్‌‌ష విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే టిడిఎల్‌పి, వైఎస్‌ఆర్‌ఎల్‌పి, బిఎస్‌పిని టిఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్న గులాబీ దళం తాజాగా తన దృష్టిని కాంగ్రెస్‌ వైపు ఫోకస్‌ చేసింది. పార్టీ పునాదులు కాస్తా బలహీనంగా ఉన్నాయని భావిస్తున్న నల్గొండ, పాలమూరు జిల్లాలపై దృష్టిని కేంద్రీకరించింది. ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల తో పాటు కాస్తా ప్రజాధరణ ఉన్న కాంగ్రెస్‌ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  వీరితో పాటు నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, 10 మంది జడ్‌పిటిసి సభ్యులు, 8 మంది ఎంపిపిలు,భువనగిరి పార్లమెంట్‌, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ నేతలు పెద్ద ఎత్తున టిఆర్‌ఎస్‌ లో చేరనున్నారని గులాబీ భవన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గాంధీ భవన్‌ మెట్లెక్కడం మానేశారు. అదే సందర్బంలో పార్టీ నేతల వ్యవహర శైలిపైన ఆయన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన రాజగోపాల్‌రెడ్డిని ఒంటిచేత్తో వెంకట్‌రెడ్డి గెలిపించారు. పిసిసి చీఫ్‌ లేదా సిఎల్‌పి పదవిని తనకు అప్పగించాలని ఆయన అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పరిణామాలన గమనించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలు ఓ బృందాన్ని ఢిల్లీకి పంపించారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు అంటున్నాయి. మంత్రి హరీశ్‌రావుతో  సన్నిహతంగా ఉంటున్న కోమటిరెడ్డి బ్రదర్‌‌స చేతిలో పార్టీ పగ్గాలు పెడితే మునిగిపోవడం ఖాయమంటూ వారు హెచ్చరిస్తున్నారు.నీటి పారుదల శాఖలో దాదాపు 1600 కోట్ల రూపాయల కాంట్రాక్టులు వీరికి వచ్చే విదంగా మంత్రి సహయం చేశారని కాంగ్రెస్‌పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. 


పొమ్మనలేక పొగబెడుతున్న కాంగ్రెస్‌ నేతలు


నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. పిసిసి చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సిఎల్‌పి నేత జానారెడ్డిలు ఈ జిల్లాకు చెందిన వారే కావడంతో వారు కోమటిరెడ్డి ఎదుగుదలను అడ్డుకుం టున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. వీరికి ఎంపిలు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు జత కలిశారు. సుదీర్ఘ కాలంగా పాల్వాయి తో కోమటిరెడ్డి సోదరులకు విభేదాలున్నాయి. నాయకత్వ మార్పు పై కాంగ్రెస్‌ పార్టీలో అనేక ఊహగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో తనకు పిసిసి చీఫ్‌ గానీ, సిఎల్‌పి నేతగా ఐన అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్ఠానానికి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన జానా, ఉత్తమ్‌ అనుచ రులు ఢిల్లీకి పయనమయ్యారు. కోమటిరెడ్డి సోదరుల వ్యవహరశైలిపై అధిష్ఠా నానికి ఫిర్యాదు చేశారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. వచ్చే ఎన్నికలలో కాం గ్రెస్‌ పార్టీని టిఆర్‌ఎస్‌కు తాకట్టు పెట్టేందుకు వీరు సిద్దమయ్యారని కొన్ని ఆధా రాలను సమర్పించినట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బృందానికి ఉత్తమ్‌ ప్రధాన అనుచరుడు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు నేతృత్వం వహించినట్టు ఆ పార్టీ వర్గాలు కోడై కూస్తున్నాయి. మొత్తంగా కోమటిరెడ్డి సోదరులను కాంగ్రెస్‌ నుండి సాగనంపేందుకు నేతలంతా ఒక్కటయ్యారన్న ప్రచారం జరుగుతుంది.


టిఆర్‌ఎస్‌లో చేరకుండా అడ్డుకుంటున్న మంత్రి జగదీశ్‌రెడ్డి


కోమటిరెడ్డి సోదరుల పార్టీ మార్పు పై క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్లు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి తన రాజకీయ అస్థిత్వానికి ప్రమాదం వాటిల్లుతుందన్న అంచనాలో ఉన్న్రారు. దీంతో కోమటిరెడ్డి సోదరుల రాకను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గ్యాదరి కిషోర్‌కుమార్‌ లు సిఎంను కలిసి తమ అభిప్రాయాలు వెల్లడించారని సమాచారం. టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ జిల్లా బాధ్యతలను జగదీశ్‌రెడ్డికి అప్పగించినప్పటికి ఆయన అనుకున్న స్థాయిలో పనిచేయలేదని కెసిఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం.


    రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో టిఆర్‌ఎస్‌ను తిరుగులేని రాజకీయశక్తిగా నిలిపేందుకు కెసిఆర్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో బాగంగానే కోమటిరెడ్డి సోదరులు పార్టీ లో చేరేందుకు ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని గులాబీభవన్‌ వర్గాలు పేర్కొంటు న్నాయి. రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కెసిఆర్‌ బిజీగా ఉన్నారని జూన్‌ ఆరున కోమటిరెడ్డి సోదరులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి గులాబీ తీర్థం పుచ్చుకుంటారని టిఆర్‌ఎస్‌ ముఖ్యనేతలకు సమాచారం అందింది. వారి చేరి ƒతో నల్గొండ జిల్లాలోను టిఆర్‌ఎస్‌కు బలం పెరుగుతుందని గులాబీ నేతలు విశ్వసిస్తున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa