నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడం దారుణం
అర్ధరాత్రి కోదండను అరెస్టు చేయాల్సిన అవసరమేమెుచ్చింది
రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతోంది
కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష నేతలు ఫైర్
హైదరాబాద్, మేజర్‌న్యూస్ : నిరుద్యోగుల నిరసన ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోగా, అర్ధరాత్రి టీ-జాక్ చైర్మన్ కోదండరామ్‌ను అరెస్టు చేయడాన్ని విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించతలపెట్టిన నిరసన ప్రదర్శనకు సర్కార్ అనుమతి ఇవ్వకపోవడం దారుణమని పలువురు కాంగ్రెస్, టీడీపీనేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన నియంతృత్వాన్ని తలపిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లుతెరిచి వాస్తవాలను గ్రహించాలని, నిరుద్యోగుల వెతల్ని అర్థం చేసుకుని ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కోదం డరామ్‌ను అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తు న్నారు. కోదండరామ్‌తో సహా విద్యార్థులను అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. తెలంగాణ వాదాన్ని తెలంగాణ వాదులే జైల్లో పెట్టారని, ఇది ప్రజాస్వామ్య తెలంగాణ కాదని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. మనకు కావాల్సింది దొరల తెలంగాణ కాదని, బతుకు తెలం గాణ కావాలని తమ్మినేని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగాల భర్తీకి సన్నద్దమవుతుంటే, వాటిని మేమే భర్తీ చేస్తామని అప్పట్లో కేసీఆర్ అడ్డుపడ్డా డని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని టీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగుల పాలిట ఈ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి దారుణ మని ఆయన మండిపడ్డారు. కోదండరామ్‌ను అరెస్టు చేయడంద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని, రాచరిక పాలన కొనసాగుతుందని మరోమారు స్పష్టమయిందన్నారు. కోదండను అరెస్టు చేసి కేసీఆర్ సర్కార్ సెల్‌ఫ గోల్ చేసు కుందని టీ-పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి విమర్శించారు. నిరుద్యోగ ర్యాలీకి అనుమతించకపోవడం టీఆర్‌ఎస్ నియంతృత్వ పాలనకు నిదర్శనమని సికిం ద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు డిమాండ్ చేయడం సహేతుకమైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇప్పటి కైనా కళ్లు తెరిచి నిరుద్యోగ సమస్యపై స్పందించాలన్నారు. వెంటనే ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని రావుల డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల తమ ఆకాంక్షలపై గొంతెత్తడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం కూడా నేరమేనా? అని ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో, ఎన్నికల ముందు లక్షా ఉద్యోగా లిస్తామని పదే, పదే చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఉద్యోగాలు అడగడమే నేరమన్న ట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa