ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరు నెలల్లో రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 01:09 AM

 -ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 6.20 లక్షలు ఖర్చు చేస్తున్నాం


  -పతి అర్హునికి ఇల్లు నిర్మిస్తాం


  -పభుత్వ ఆసుపు్తల్రలో ప్రసవాలను పెంచాలి


కరీంనగర్‌-సూర్యప్రత్యేకప్రతినిధి  : జిల్లాలో 6నెలలోపు రెండుపకడ గదుల ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక, బలహీన వర్గాల సంక్షేమశాఖ మంత్రి ఈటెల రాజేంధర్‌ అన్నారు. గురువారం కలెక్టరేటులో వివిధ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి పద్నాలుగు వందల రెండు పడక గదుల ఇండ్లను మంజురు అయినట్లు తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గ్రామాలలో స్థానిక శాసన సభ్యులు సహాకారంతో వెంటనే పూర్తి చేయ్యాలని అన్నారు. మున్సిపాలిటిలు, నగర పంచాయతీలలలో జి ప్లస్‌ వన్‌ పద్దతిలో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఒక ఎకరాలలో 25ఇండ్లను నిర్మించవచ్చని అన్నారు. పట్టణాలలో ప్రతి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 6లక్షల 20వేల వరకు ఖర్చు చేస్తుందని అన్నారు. ఇవి అనాటి పది ఇండ్లకు సమానమని అన్నారు. కాంట్రాక్టర్లతో చర్చించి, నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామా పంచాయితిలలలో అర్హులను గుర్తించాలని అన్నారు. అవసరమై స్థలాలను గుర్తించాలని అన్నారు. త్రాగునీటి సౌకర్యాల కొరకు జమ్మికుంటకు 40కోట్లు, హుజురాబాద్‌కు 50కోట్లు మంజురు చేసినట్లు తెలిపారు. ఈ నిధులలో పట్టణాలలో అంతర్గత పైపులైను నిర్మాణాలు చేపట్టలని అన్నారు. ఆ రెండు పట్టణాలకు 70శాతం అంతర్గత రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. రోడ్లకు విలైనంత తక్కువ నష్టం కలిగించే విధంగా పైపు లైనులను నిర్మించాలని అన్నారు. డిసెంబర్‌ 2017 నాటికి మిషన్‌ భగీరధ పనుల పూర్తవుతాయని ఆ లోగా ఈ పనులను పూర్తి చెయ్యాలని ఆదేశించారు.పట్టణాలలోని రోడ్లు, వాటర్‌గ్రిడ్‌, సిసిరోడ్లు, సెంట్రల్‌ లైటింగ్‌, హరితహారం పథకాలను సమర్దవంతంగా అమలు చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొనుగోలు చేసిన అన్ని పరికాలు పని చేస్తు ఉండాలని అన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను పెంపొందించాలని డిఎంఅండ్‌ హెచ్‌వోను ఆదేశించారు. ఆసుపత్రులలో మరుగుదొడ్లు నిర్వాహణ బాగుండాలని అన్నారు. ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రొత్సహించాలని అన్నారు. ప్రతి ఆసుపత్రిలో సిబ్బంది ఖచ్చితంగా ఉండాలి, కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో టిబి మల్టిరెసిస్టెంటు వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న ముజురాబాద్‌ ఆసుపత్రి, డిఎంఅండ్‌ హెచ్‌వో కార్యాలయం, కమలాపూర్‌, ఆసుపత్రిలను మార్చి 15లోపు చెయ్యాలని ఆదేశించారు. శాభాష్‌పల్లి వద్ద నిర్మిస్తున్న నాలుగులైన్ల రోడ్డు, మార్చి నెలాఖరునాటికి, 2లైన్‌ బ్రిడ్జి , మార్చి నెలాఖారు నాటికి మరొ 2లైన్‌ రోడ్డు జూన్‌ చివరి నాటికి పూర్తి చేయ్యనున్నట్లు తెలిపారు. పాత కరీంనగర్‌ జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలలో అవసరమైన పర్నిచర్‌ను ఎప్రిల్‌ నాటికి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పాత కరీంనగర్‌ జిల్లాలోని అన్ని బస్టాండ్‌లలో మౌళిక సదుపాయం కల్పనకు రూ.10కోట్లను కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో పాత బస్‌స్టాండ్‌ల స్థితిగతులపై నివేదికను వెంటనే పంపాలని అన్నారు. మే 31 లోపల అన్ని బస్సు స్టాండులలో సౌకర్యాలను కల్పించాలని అన్నారు. నెలలో 10రోజులలో 10 వేల 423 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. జనవరి 13నాటికి 11 వేల 777పూర్తి అయ్యాయని అప్పటి నుండి ఫిబ్రవరి 22 వరకు 22వేల 100 టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో 38,885 మరుగుదొడ్లకు మంజురు ఇచ్చినట్లు ఉగాది నాటికి అన్ని మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి ఓడిఎఫ్‌గా ప్రకటించడానికి ఏర్పాటు చేయ్యాలని అధికారులను ఆదేశించారు. రెండు వేలు మరుగుదొడ్లను ఇంకా మొదలు పెట్టలేదని తెలిపారు. పనులు వేగవంతం చేసే ఉగాది నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సిఈవో, సాంస్కృతిక సారధి చైర్మేన్‌  రసమయి బాలకిషన్‌, ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్‌, ఎంమ్మెల్యే, హుస్నాబాద్‌ ఒడితెల సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గోన్నారు. 


మహిళలు ఆర్థికాభివృద్ది సాధించుటకు ప్రభుత్వం చేయుత


బ్యాంకుల ద్వారా రుణం పొందిన మహిళలు వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్తికంగా అభివృద్ది సాధించాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేంధర్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌ మండలం మల్కాపూర్‌లో ఇండియన్‌ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రుణ  వితరణ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై 25 కోట్ల రుణాలను లబ్దిదారులకు పంపిణి చేశారు. బ్యాంకుల గ్రామీణ ప్రజల ఆర్తిక అభివృద్దికి రుణాలను మంజురు చేసి ఆదుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ భాధ్యత మహిళలపై ఉందన్నారు. తీసుకున్న లోను 100శాతం మహిళలు తిరిగి బ్యాంకులకు చెల్లిస్తున్నారని వారిని మరింత ప్రోత్సహించాలని బ్యాంకు అధికారులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ  చూపుతుందని వ్యవసాయ అనుబంధరుణాలను ప్రోత్సహించాలని తెలిపారు. 200స్వశక్తి మహిళా గ్రూపులకు 12కోట్లు రుణాలను వ్యవసాయ దారులకు ట్రాక్ట్రర్లను మంత్రి చేతుల మీదుగా అందచేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ, కరీంనగర్‌ శాసన సభ్యులు గంగుల కమలాకర్‌, ఎంపిపి వాసాల రమేష్‌, జడ్పిటిసి ఎడ్ల శ్రీనివాస్‌, డిఆర్‌వో అయేష, మస్రత్‌, ఇండియన్‌బ్యాంకు జనరల్‌ మేనేజర్‌ మణిమారన్‌, జోనల్‌ మేనేజర్‌ నజీ, ముల్లాఖాన్‌ తదితరులు పాల్గోన్నారు.   










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa