నిర్వాసితుల సమస్యలపై రాష్టప్రతిని కలుస్తాం
సుధీర్ కమిటీ సూచనలు అమలు చేయాలి
ఇందు కోసం 1న మహబూబ్‌నగర్, 4న నిజామాబాద్‌లో సభలు కోదండరాం
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి : ఈ నెల 22న నిర్వ హించతలపెట్టిన నిరుద్యోగ ర్యాలీని ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా విజయవంతం అయిందని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫేసర్ కోదండరామ్ అన్నా రు. ర్యాలీ నేపథ్యంలో జరిగిన పరిణామాలు, అరెస్టుల పర్వం తదితర అంశాలపై గురువారం ఉదయం ఆయన నివాసంలో జేఏసీ నేతలు, నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి నాయకుల మధ్య చర్చించారు. అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా ర్యాలీకి వచ్చారని చెప్పారు. దాదాపు 5వేల మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలుసని, దీన్ని బట్టే ర్యాలీ విజయవంతం అయిందని చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు. ర్యాలీ కార్యక్రమం అత్య ద్భుతంగా జరిగిందని, తాము ఏం చెప్పాలనుకున్నామో అది చాలా విస్తృతంగా చెప్పగలిగామని, ర్యాలీ విజయవం తమైందని చెప్పడానికి ఇదే గీటురాయని అన్నారు. ఆయా విశ్వవిద్యాలయాల్లో నిరుద్యోగులు, యువత నిరసనలు తెలిపేందుకు తరలిన విధానం ప్రతి మీడియా గమనించిం దని గుర్తు చేశారు.
రాష్టప్రతిని కలుస్తాం
ఐక్యకార్యచరణ సమితి కార్యాచరణ కొనసాగుతుందని రాజకీయ కోదండరామ్ తెలిపారు. నిరుద్యోగ ర్యాలీ విజ యవంతమైందని కోదండరామ్ తెలిపారు. అంచనాలకు మించి ప్రజలు దీనికి వచ్చారని అన్నారు. ప్రభుత్వం అప్ర జాస్వామికంగా ప్రవర్తించిందన్నారు. నిర్వాసితుల సమస్య లపై రాష్టప్రతిని కలుస్తామని ఆయన చెప్పారు. నిన్న తన ఇంట్లో సీసీ కెమేరాల కనెక్షన్లు తొలగించి ఫుటేజీ ఉండే బాక్స్‌ను పోలీసులు తీసుకెళ్లారన్నారు. విద్యార్థుల అరెస్టు ను ఆయన ఖండించారు.
ర్యాలీకి సంఘీభావం ప్రకటించిన వారికి కృతజ్ఞతలు
నిరుద్యోగుల నిరసనర్యాలీకి సంఘీభావం ప్రకటించిన వారికి కోదండరాం కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో భవి ష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం ఆయన అన్నారు. నిర్బంధం ఉన్నా విద్యార్థులు రోడ్లపైకి వచ్చారన్నారు. 5వేల మందిని విద్యార్థులను, నిరుద్యోగులను, జేఏసీ నేతలను అరెస్ట్ చేశారని ఆయన వివరించారు. తనని మరికొంత మందిని తలుపులు బద్దలుకొట్టి ఇళ్ల నుంచి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కలవడానికి వచ్చిన సీనియర్ నేతల అరెస్ట్ చేయడం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. నిర్వాసి తుల సమస్యపై రాష్టప్రతి అపాయింట్‌మెంట్ కోరామని వివరించారు. మరోసారి ఢిల్లీ వెళ్లి రాష్టప్రతిని కలుస్తామ న్నారు. సుధీర్ కమిటీ సూచనలు అమలు చేయాలని 1న మహబూబ్‌నగర్, 4న నిజామాబాద్‌లో సభలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa