ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిట్టింగ్‌లేక మళ్లీ ఛాన్సా?!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 01:16 AM

 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల 


 మార్చిలో  ఖాళీ కానున్న మూడు స్థానాలు  గంగాధర్‌ేక మళ్లీ     అవకాశం  ఎంఐఎంకు ఒక స్థానాన్ని వదులుకునే అవకాశం 


 మూడవ స్థానం కోసం ఆ ఒక్కరెవరన్నదే తేలాల్సి ఉంది?


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో అధికార పార్టీలో ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  పదవులపై టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసిన పలువురు నేతలు ఆశలు పెంచుకున్నారు. ఈసారి తమకు ఎమ్మెల్సీగా అవకాశాన్ని కల్పించాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతు న్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి ఈసారి ఛాన్స్‌ ఇస్తా రా? లేకపోతే సిట్టింగ్‌లకే మళ్లీ అవకాశం కల్పిస్తారా? అన్నదానిపై అధికార పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది సాగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఆశావాహుల్లో  కొత్త ఉత్సాహం కనిపి స్తోంది. ఉద్యమంలో పని చేసిన తమకు ఈసారైన అవకాశం దక్కుతుందని పలువురు భావిస్తున్నారు. ఈమేరకు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీని గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీ నుంచి వచ్చినవారికి టికెట్లు కేటాయించినా పార్టీ అధికారంలోకి రావాలన్న ఏకైక లక్ష్యంతో గెలుపు కోసం పనిచేశారు. దీంతో ఎన్నికల సమయంలోనే పలు వురికి పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేషన్‌ పదవులు కట్టబెడుతానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలువురికి ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు కట్టబె ట్టారు. అయితే ఇంకా పార్టీ జెండా మోసిన నేతలు ఎంతో మంది ఉన్నారు. వారంతా ఈసారైన తమకు అవకాశం దక్కకపోతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎమ్మె ల్సీలు వి. గంగాధ్‌ గౌడ్‌, మాఘం రంగారెడ్డి, రిజ్వీల పదవికాలం  ముగియ నుంది. టీడీపీ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన గంగాధర్‌గౌడ్‌ మరొకసారి అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ రంగారెడ్డి స్థానం ఎమ్మెల్యేల బల, బలాల ప్రకారం ఈస్థానం కూడా  అధికారటీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలోనే చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీటుపై టీఆర్‌ఎస్‌లోని చాలామంది నేతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇక మూడవ  ఎమ్మెల్సీ  స్థానాన్ని అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న  ఎంఐ ఎంకు వదిలే అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎంఐఎం నుంచి రిజ్వీ, ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిత్రపక్షమైన ఎంఐఎం నుంచి  ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు చెబుతు న్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీలోని వివిధ పార్టీల బల, బలాలను పరిశీలిస్తే ప్రతిపక్షానికి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎంల మధ్య చివరి నిమిషంలో  అవగా హన కుదిరి మండలి ఎన్నికలు ఏకగ్రీవం కావొచ్చనన్న అభిప్రాయాన్ని  రాజ కీయ నేతలు వ్యక్తం చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa