ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లీజ్‌ ఒక్క ఛాన్‌‌స

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 02:54 AM

-ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ నేతల ఆశలు  


-సీఎం దృష్టిని ఆకర్షించేందుకు యత్నం  


-మంు్తల్రతో మంత్రాంగం  


-కేటీఆర్‌ ఆశీస్సుల కోసం ప్రయత్నం


హైదరాబాద్‌, సూర్య ప్రధానప్రతినిధి: తెలంగాణ శాసనసభ్యుల కోటాలో మండలికి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదవులపై టీఆర్‌ఎస్‌లో చాలామంది నేతలు కన్నేశారు. ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు ఫ్లీజ్‌ ఒక్కఛాన్‌‌స అంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి ఛాన్‌‌స ఇస్తారా..? లేక మరెవరికి పదవులు దక్కుతాయి..? అన్న చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. శాసనసభ్యుల కోటాలో ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో గులాబీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉద్యమంలో పాల్గొన్న చాలామంది నేతలు పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.వీరితో పాటు కాంగ్రెస్‌, టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌ ఆకర్‌‌షకు ఆకర్షితులై పార్టీలో చేరిన నేతలు ఎమ్మెల్సీ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు.  ఎన్నికల ముందు కూడా కేసీఆర్‌ శాసన మండలి సభ్యులుగా అవకాశం కల్పిస్తామని చాలామంది నాయకులకు హామీ ఇచ్చారు. దీంతో వారంతా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. శాసనసభ్యుల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగడంతో  ఉద్యమంలో పనిచేసిన వారంతా పదవులు దక్కుతాయన్న  ధీమాతో ఉన్నారు. మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీలు వి. గంగాదర్‌గౌడ్‌, మాఘం రంగారెడ్డి, రిజ్వీల పదవీకాలం ముగియ్నుంది.  టీడీపీ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన గంగాదర్‌గౌడ్‌ మరోసారి అవకాశం కోసం ఆశపెట్టుకున్నారు.  కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ రంగారెడ్డి స్థానం కూడా శాసనసభ్యుల సంఖ్య ప్రకారం అధికార పార్టీకే దక్కనుంది. ఈ సీటుపై టీఆర్‌ఎస్‌లోని చాలామంది నేతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఎంఐఎం ఎమ్మెల్సీ రిజ్వీ స్థానాన్ని ఆ పార్టీకి అధికార పార్టీ మద్దతిస్తుందా..? లేదా అన్న దాపిపై విస్తృత చర్చ సాగుతోంది. టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా ఉన్నఎంఐఎం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలు స్తోంది.  టీఆర్‌ఎస్‌, ఎంఐఎంల అవగాహన ఒప్పందం తోనే మండలి ఎన్నికలు ఏకగ్రీవం కావొచ్చన్న అభిప్రా యం చాలామంది నేతల్లో వ్యక్తమవుతోంది.


సీఎం దృష్టిలో పడేందుకు యత్నం : ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్న పలువురు నేతలు ఓ పక్క ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిలో పడేందుకు తెగ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అలాగే ప్రభుత్వంలో కీలకనేతలగా ఎదిగిన మంత్రి కేటీ ఆర్‌ ఆశీస్సులకోసం ఆయన ఒక్కడికి వెళ్లినా నేతలు అక్క డికి వెళ్లి ఆయనను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తు న్నారు. ఇటీవల ముఖ్యమంత్రి నామినెటెడ్‌ పదవుల ఎంపి కలో గట్టి నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటు న్నాయి. ఉద్యమ నేతలకు పదవులు ఇవ్వడంలేదన్న అపవాదు నుంచి బయట పడేందుకు ఇటీవల ప్రభుత్వ నామినెటెడ్‌ పదవుల్లో వారికి పెద్దపీట వేసిన విషయం విధి తమే. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వచ్చిన నేతల ఆశలు ఆడియా సలుగానే మిగులుతాయని పార్టీకి చెందిన సీనియర్లు అంటున్నారు. ఈసారి శాసనసభ కోటా నుంచి ఎంపిక చేసే ఎమ్మెల్సీ స్థానాలను ఉద్యమంలో కీలక ంగా పనిచేసిన నేతలకే వరిస్తుందని పేర్కొంటున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa