ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ హావ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 24, 2017, 03:01 AM

-ముంబాయిలో శివసేనకు 84, బిజెపికి 81, కాంగ్రెస్‌కు 31 స్థానాలు కైవసం


-ముంబాయిలో శివసేన సత్తా  


 -ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో హంగ్‌  


 -బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి  


 -శివసేనకు 84, బిజెపికి 81 సీట్లు  


-కాంగ్రెస్‌, ఎన్సీపీలకు కోలుకోలేని ఎదురు దెబ్బ 


 -ఒంటరిగా పోటీ చేసి విజయం కైవసం చేసుకున్న శివసేన  


-వరుసగా ఆరోసారి విజయం సాధించిన శివసేన నాయకురాలు శ్రద్ధా జాదవ్‌  


-కేవలం 31 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌  


-ముంబయి కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ రాజీనామా


-సీనియర్లంతా తనను ఓడించేందుకు ప్రయత్నించారని నిరుపమ్‌ ఆరోపణ


ముంబయి: అత్యంత ప్రతిష్ఠాత్మక బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికల్లో శివసేన తన సత్తా చాటింది. చిరకాల మిత్రపక్షం బిజెపిని కాదని ఈ సారి ఒంటరిగా పోటీచేసిన ఆ పార్టీ అత్య ధిక స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంది. ముందు కాస్త జోరు తగ్గినట్లు కనిపించిన బిజెపి చివరకు శివసేన కంటే కొద్దిగా వెనకబడి రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌, ఎన్సీపీలకు ఈ సారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏ ఒక్క పార్టీకీ సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. బీఎంసీలోని మొత్తం 227 వార్డులకు గాను 226 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో శివసేన 84 స్థానాల్లో విజయం సాధించింది. భాజపా 81 స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ పార్టీ కేవలం 31 స్థానాలు గెలుచుకుంది. ఎన్సీపీ కేవలం 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) 9 స్థానాల్లోనూ, ఇతరులు 14 స్థానాల్లోనూ గెలుపొందారు. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరే షన్‌(బీఎంసీ) ఎన్నికల కౌటింగ్‌లో శివసేన దూకుడు కొనసాగించింది. బీఎంసీ మాజీ మేయర్‌, శివసేన నాయకురాలు శ్రద్ధా జాదవ్‌ ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో వరుసగా ఆరోసారి విజయం సాధించారు. వార్‌‌డ నెం.202 నుంచి ఆమె గెలుపొందారు. బీజేపీ ఎంపీ కిరిట్‌ సోమా లియా కుమారుడు నియిల్‌ వార్డు నెం.108 నుంచి విజయం సాధిం చగా, ముంబై బీజేపీ విభాగం చీఫ్‌ అశిష్‌ షెలార్‌  సోదరుడు వినోద్‌ షెలార్‌ వార్‌‌డ నెం.51లో ఓటమి పాలయ్యారు. మరోవైపు 227 వార్డులున్న బీఎంసీలో కౌంటింగ్‌ మొదలైనప్పటి నుంచీ శివసేన హవా కొనసాగుతోంది. వందకు పైగా వార్డుల్లో శివసేన ఆధిక్యంలో ఉండగా, బీజేపీ మాత్రం 50 వార్డుల్లో ఆధిక్యంతో రెండో స్థానంలో ఉంది. కాగా ఫలి తాలు రాకముందు నుండే శివసేన పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం విశేషం. బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవం చవిచూసింది. కేవలం 31 స్థానాలు మాత్రమే దక్కించు కుంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముంబై కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ గురువారం పార్టీ అధిష్టానానికి తన రాజీనామా లేఖ పంపారు. పార్టీ సీనియర్‌ నేతల కారణంగానే బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ ఓడిందని ఆయన ఆరోపించారు. సీనియర్లంతా తనను ఓడించేందుకు ప్రయ త్నించారని ఫలితంగా పార్టీనే ఓడిపోయిందని నిరుపమ్‌ ఆవేదన వ్యక్తం చేశా రు. కాంగ్రెస్‌ అధిష్టానికి ఇదంతా తెలుసన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa