ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీం తీర్పు అందరికీ హెచ్చరిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 11, 2017, 03:57 AM

బీహార్‌ పశు దాణా కుంభకోణం కేసులో సోమవారం అత్యద్భుత ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా సుప్రీం కోర్టు చట్టం గౌరవాన్ని నిలబెట్టింది. రాజకీయ ఘనాపాఠి అయిన బీహార్‌ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రధాన నిందితుడైన ఈ కేసులో ఈ ఉత్తర్వుల ద్వారా అత్యున్నత స్థానం ఏ రంగంలోను న్యాయ శాసనాన్ని చులకన చేయడాన్ని ఏమాత్రం సహించబోనని సుస్పష్టం చేసింది. అత్యున్నత స్థాయిలోని రాజకీయ నేతలు, ఉన్నత న్యాయవ్యవస్థలోని న్యాయమూర్తులు, అత్యున్నత అధికార యంత్రాంగం, కేంద్ర నేరపరిశోధక సంస్థ (సిబిఐ)లకు ఇది గట్టి గుణ పాఠం కావలసిన అవసరం ఉన్నది. లాలూ యాదవ్‌ పట్ల మెత్తగా వ్యవహరించినట్లుగా కనిపిస్తున్న ఝార్ఖండ్‌ హైకోర్టు తీర్పునే కాకుండా, ఆ తీర్పుపై అప్పీల్‌ చేయడంలో అనైతిక కాలహరణానికి సిబిఐని కూడా సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తీవ్రంగా తప్పు పట్టింది. పశు దాణా కుంభకోణానికి సంబంధించిన పలు కేసులలో లాలూ విచారణను ఎదుర్కొనవలసి ఉంటుంది. 


బీహార్‌ పశు దాణా కుంభకోణం కేసులో సోమవారం అత్యద్భుత ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా సుప్రీం కోర్టు చట్టం గౌరవాన్ని నిలబెట్టింది. రాజకీయ ఘనాపాఠి అయిన బీహార్‌ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రధాన నిందితుడైన ఈ కేసులో ఈ ఉత్తర్వుల ద్వారా అత్యున్నత స్థానం ఏ రంగంలోను న్యాయ శాసనాన్ని చులకన చేయడాన్ని ఏమాత్రం సహించబోనని సుస్పష్టం చేసింది. అత్యున్నత స్థాయిలోని రాజకీయ నేతలు, ఉన్నత న్యాయవ్యవస్థలోని న్యాయమూర్తులు, అత్యున్నత అధికార యంత్రాంగం, కేంద్ర నేరపరిశోధక సంస్థ (సిబిఐ)లకు ఇది గట్టి గుణ పాఠం కావలసిన అవసరం ఉన్నది. లాలూ యాదవ్‌ పట్ల మెత్తగా వ్యవహరించినట్లుగా కనిపిస్తున్న ఝార్ఖండ్‌ హైకోర్టు తీర్పునే కాకుండా, ఆ తీర్పుపై అప్పీల్‌ చేయడంలో అనైతిక కాలహరణానికి సిబిఐని కూడా సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తీవ్రంగా తప్పు పట్టింది.


  పశు దాణా కుంభకోణానికి సంబంధించిన పలు కేసులలో లాలూ విచారణను ఎదుర్కొనవలసి ఉంటుంది. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ విచారణను తొమ్మిది మాసాలో పూర్తి చేయవలసి ఉంటుంది. ఝార్ఖండ్‌ హైకోర్టు గతంలో ఉపసంహరించిన ఒక కేసులోని కుట్ర అభియోగాలను సుప్రీం కోర్టు పునరుద్ధరించింది. ఈ పరిణామం ఒక్క లాలూకే కాకుండా ఆర్‌జెడి మిత్ర పక్షం జనతా దళ్‌ అధినేత, బీహార్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌కు కూడా ఎదురుదెబ్బ. ఇది నితీశ్‌ను ఇబ్బందికర పరిస్థితిలోకి నెడుతుంది. పశు దాణా కుంభకోణం 1990 దశకం నాటిది. పశువులకు దాణా, మందుల కొనుగోలు నిమిత్తం బోగస్‌ బిల్లులు ఉపయోగించడం ద్వారా రమారమి వెయ్యి కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. లాలూ ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో సుప్రీం కోర్టు నుంచి ఈ ఉత్తర్వు వెలువడింది. పాట్నా జూకు మట్టి సరఫరా కాంట్రాక్ట్‌ లాలూ కుటుంబ యాజమాన్యంలోని ఒక సంస్థకు ఇచ్చారని బిజెపి ఆరోపించింది. ఈ ఆరోపణలు బిజెపికి, నితీశ్‌ విమర్శ కులకు సరికొత్త అస్త్రాలను ఇస్తా యి. సత్పరిపాలనను అందిస్తు న్నారన్న నితీశ్‌ ఖ్యాతికి ఇది విఘాతం కలిగిస్తుంది. కాగా పశు దాణా కేసులో సకాలంలో అప్పీల్‌ చేయని తమ అధికారిని జవాబుదారీ చేయాలని సిబిఐ డైరెక్టర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించిన విధంగానే ఆ తీర్పు వెలువరించిన న్యాయమూర్తి ఇప్పటికి రిటైరై ఉండవచ్చు కాని ఆయనపై జవాబుదారీతనాన్ని కూడా సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందని ఆశించవచ్చు. జయలలిత కేసుతో ప్రారంభించి, ఎల్‌కె అద్వానీ, మరి కొందరు బిజెపి సీనియర్‌ నేతలకు ప్రమేయం ఉన్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసు పునరుద్ధరణతో పాటు, ఇప్పుడు పశు దాణా కేసులో పునర్విచారణకు ఆదేశించడం ద్వారా న్యాయ శాసనాన్ని వక్రీకరించడం ఏమాత్రం కుదరదన్న బలమైన సంకేతాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం పంపించింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రమేయం ఉన్న బిజెపి సీనియర్‌ నేతలలో ఒకరు ప్రస్తుతం కేంద్ర మంత్రి కాగా మరొకరు ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న విషయం విదితమే.


     కాగా, పై విధంగా సుప్రీం కోర్టు సంకేతాలు పంపడం అవసరమే. ఆదర్శవాద వ్యక్తులు, రాజకేయతర సామాజిక నాయకులు అత్యున్నత స్థాయిలో సాగించే బహిరంగ ప్రచారోద్యమాలు అవినీతి గురించి, నేర మనస్తత్వం గురించి ప్రజలను చైతన్యపరచడానికి దోహదం చేస్తాయి. అయితే, అటువంటి ప్రచారోద్య మా లను అవకాశంగా తీసుకుని అవి నీతి రహిత పాలనాయం త్రాంగాన్ని సమకూరు స్తామనే వాగ్దానంతో కొత్త ప్రభుత్వాలు బాధ్యతలు స్వీకరిస్తుంటాయి. కాని పాత జాడ్యం తిరుగుముఖం పట్టడానికి ఎంతో కాలం పట్టదు. దేశంలో మనం తరచు చూస్తున్నట్లుగా అత్యుత్తమ న్యాయ శాసనాలు కలిగి ఉండడమే సరిపోదు. సత్వర, నిష్పాక్షిక, పారదర్శక విచారణలు జరిపించడం ద్వారా దోషులపై మన న్యాయ పాలన యంత్రాంగం శీఘ్రంగా చర్య తీసుకోవడం ముఖ్యం. ఇక్కడ ప్రస్తావించిన మూడు ప్రముఖ కేసులలో లోపించినది అదే. ప్రతి కేసులో తగినంత కాలహరణం చోటు చేసుకున్న తరువాత పై స్థాయిలోని న్యాయవ్యవస్థ జోక్యం చేసుకున్నది. దోషులు దాదాపుగా తప్పించుకున్న తరుణంలో అత్యున్నత న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడం గణనీయ ప్రభావం చూపుతుంది. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వు కారణంగా బీహార్‌ మరొక మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్‌ మిశ్రా, ఝార్ఖండ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సజల్‌ చ్రబర్తిలతో పాటు లాలూ యాదవ్‌ ఈ కేసులో తిరిగి విచారణ ఎదుర్కొననున్నారు. వివిధ బీహార్‌ ప్రభుత్వ కోశాగారాల నుంచి పశు సంవర్ధక శాఖకు సంబంధించిన నిధులను అక్రమ లావాదేవీలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడానికి కుట్ర పన్నారనేది వారిపై అభియోగం. లాలూ యాదవ్‌ తాను నిందితుడుగా ఉన్న మరి ఐదు పశు దాణా కుంభకోణం కేసులు ఒక్కొక్కదానిలో వేర్వేరుగా విచారణలు ఎదుర్కొననున్నారు. లాలూ యాదవ్‌పై సరికొత్త విచారణ రాజకీయ పర్యవసానాలకు దారి తీస్తుంది. ఆర్‌జెడి భాగస్వామిగా ఉన్న బీహార్‌ ప్రభుత్వంపై ఇది ప్రభావం చూపగలదు. ఇంకా దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక రాజకీయాలపై కూడా దీని ప్రభావం పడగలదు. 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగే సమయానికి బిజెపి పురోగతిని అడ్డుకోవాలని ఆలోచిస్తున్న ప్రతిపక్షాలకు బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ తీసుకువచ్చిన మహా కూటమి అనుసరించవలసిన రాచబాట. 2019లో బిజెపిని ఢీకొనే ప్రాంతీయ పార్టీలతో కూడా జాతీయ సంకీర్ణానికి నితీశ్‌ సారథి కాగల అవకాశం ఉంది. తక్కిన ప్రతిపక్ష నేతలలో అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతి వంటివారికి బేరసారాలు సాగించే శక్తి పరిమితమే. ఆ శక్తి ఉన్న లాలూ పశు దాణా కుంభకోణం కేసులో ఇప్పటికే దోషిగా నిర్ధారితుడు. నితీశ్‌ ఇప్పటికే సంకీర్ణం విషయమై పటేల్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌, ఎన్‌సిపిలతో చర్చలు సాగిస్తున్నారు. ఆయనకు అరవింద్‌ కేజ్రీవాల్‌, మమతా బెనర్జీలతో సుహృద్భావ సంబంధాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో లాలూ కేసులు వంటి ప్రతికూలతలను అధిగమించవలసిన అగత్యం నితీశ్‌కు ఉన్నది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com