ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందిస్తాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 11, 2017, 04:44 AM

పటాన్‌చెరు, మేజర్‌ న్యూస్‌ : లో ఓల్టేజి సమస్యను పరిష్కడంలో పాటు నిరంత రం నాణ్యమైన విద్యుత్‌ అందించే దిశగా పటాన్‌చెరు నియోజకవర్గంలోని పటాన్‌చెరు, జిన్నారం,రామచంద్రాపురం మండలాల్లో బుధవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరిశ్‌రావు పలు అభివృద్ది పనులకు శంఖుస్థా పనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామచంద్రాపురం మండంలోని వెల్మెల గ్రామంలో రూ.1.40కోట్లతో నిర్మించినున్న సబ్‌ స్టేషన్‌, కొల్లూర్‌ గ్రామంలో రూ.1.60కోట్లతో నిర్మించునున్న సబ్‌ స్టేషన్‌, రామచంద్రాపురంలో నిర్మించనున్న బాక్స్‌ టైపు కల్వర్ట్‌న కు,పటాన్‌చెరులో రూ. 1.20కోట్లతో ఏర్పాటు చేయనున్న సబ్‌ స్టేషన్‌ భవనంకు చిట్కూల్‌ గ్రామంలో రూ. 1.68కోట్లతో నిర్మించునున్న సబ్‌ స్టేసన్‌కు కిష్టారెడ్డిపేటలో నిర్మించిన సబ్‌స్టేషన గడ్డపోతారం గ్రామం నుండి బొల్లారం వరకు రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శంఖుస్థాపనలు చేశారు. బొల్లారంలో నిర్మించిన సబ్‌ స్టేషన్‌ను ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం ప్రహారి గోడను మంత్రి ప్రారంభోత్సవం చేశారు. గతంలో  పరిశ్రమలకు మూడు రోజుల పాటు పవార్‌ హాలిడే ఉన్నందున కార్మికులు చాల ఇబ్బందులకు గురయ్యేవారని, కాని ఇప్పుడు విద్యుత్‌ సరఫరా నిరంతరంగా ఇస్తున్నందున వారికి జీవనబృతి కలుగుతుందన్నారు. ఒక పంట పండే లోపలే మీటర్లు, ట్రాన్స్‌ఫార్మార్లు కాలిపోయేవని గుర్తు చేశారు. వచ్చే ఏడాది నుండి భావి దగ్గర కూడ పంట పొలాలకు నీరందించేందుకు ప్రభుత్వం 24 గంటల పాటు విద్యుత్‌ అందించే యేచనలో ఉందన్నారు. ఉమ్మడి మెదక్‌త జిల్లాకు రాష్ట్ర అవిర్భాం నాటి నుండి విద్యుత్‌పంపిణీ మెరుగుపర్చేందుకు సుమారు రూ. 1.438కోట్లు ఖర్చుచేశామన్నారు. పటాన్‌చెరులో రైతుల సౌకార్యార్థం డి.ఇ. ఆఫీసును ఏర్పాటు చేస్తామని హామిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో జివో. 58 క్రింద సుమారు 4వేల మందికి పట్టాలిచ్చామన్నరు. భారతదేశంలోనే కోతలు లేకుండా 24గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించే మొట్ట మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్టమ్రని పేర్కొన్నారు. పటాన్‌చెరులో 132 కే.వి. సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని స్థానిక శాసన సభ్యులు కోరగా మంత్రి సానుకులంగా స్పందిస్తూ సుమారు రూ. 25కోట్లు వెచ్చించి సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు హమిచ్చారు. అంతేకాకుండా రామచంద్రారంలో ఉన్న 132 కే.వి. సబ్‌ స్టేషన్‌ను 220 కే.వి.సబ్‌ స్టేషన్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తామని తెలిపారు. పటాన్‌చెరువు నియోజవర్గంలో ఇంటింటికి నల్లా ఏర్పాటు చేసి తాగు నీరందించేందుకు చర్యలు చేపడుతామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం అమ్మ ఒడి కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. అందులో భాగంగా ఆడ పిల్ల జన్మించితే రూ. 13వేలు, మగ పిల్లవాడు జన్మించితే రూ. 12వేలతో 16 వస్తువులతో కూడిన కేసిఆర్‌ కిట్‌ను అందజేయడం జరుగుతుందన్నారు. పటాన్‌చెరులో 5 ఎకరాల స్థలంలో డంప్‌ యార్టును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 


   ఈ కార్యక్రమంలో  ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌, మార్కెట్‌ కమిటి చైర్మెన్‌ పుష్ప నాగేష్‌ యాదవ్‌, కార్పోరేటర్‌లు తొంట అంజయ్య యాదవ్‌, సిందు ఆదర్శ్‌రెడ్డి, ఎంపిపిలు యాదగిరి యాదవ్‌, శ్రీశైలం యాదవ్‌, జడ్పిటిసి రాములు గౌడ్‌, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com