- చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌దే విజయావకాశాలు
న్యూఢిల్లీ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత విజయావకాశాలు విరాట్ కోహ్లీ ఒక్కడిపైనే ఆధార పడలేదని టీమిండియా మాజీ సారథి కపిల్‌దేవ్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరుగు తున్న ఐపీఎల్‌లో కోహ్లీ మునుపటిలాగా పరుగు లు చేయలేకపోతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లో తన మైనపు ప్రతిమ ఆవిష్క రణ సందర్భంగా కపిల్ విలేకరులతో మాట్లాడా రు. ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఫా మ్ భారత అవకాశాలపై ప్రభావం చూపిస్తుందా? అనే ప్రశ్నకు కపిల్ బదులిచ్చారు. ధర్మశాలలో ఆస్ట్రేలియాతో టెస్‌ట మ్యాచ్ చూశారా? అప్పుడంతా కోహ్లీ ఆడకపోతే టీమిండియా ఓడిపోతుందన్నా రు. కానీ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అత డిపై అంచనాలు పెంచుకొని ఇతర ఆటగాళ్లను దిగ జార్చడం సమంజసం కాదు. జట్టులో విరాట్ చా లా ముఖ్యమైన ఆటగాడు. అతడికి ఎప్పుడు, ఎలా ఆడాలో పూర్తిగా తెలుసు అని అన్నారు.
తమ ప్రణాళికలను కచ్చితంగా అమలు చేయ గలిగే సామర్థ్యాన్ని బట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీసేన గెలుపు అవకాశాలు ఉంటాయని కపిల్ అభిప్రాయపడ్డారు. టీమిండియా చాలా బాగుంద ని, గత ఐదారేళ్లుగా అద్భుతంగా ఆడుతోందన్నా రు. ఇంగ్లాండ్‌లో నిలకడగా ఆడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం అత్యంత కీలకమన్నారు. అక్కడ ఏ బౌలర్ రాణిస్తాడో చెప్పలేమని అందరూ సమష్టి గా బౌలింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. సెలెక్టర్లు జట్టు ఎంపికలో అనుభవానికి పెద్దపీట వేయడం మంచిదే అన్నారు. ఒకవేళ యువకులను ఎంపిక చేసినట్లయితే సీనియర్లను ఎందుకు పక్కనపెట్టా రని మీరు (విలేకరులు) ప్రశ్నించేవారని పేర్కొన్నా రు. సెలక్టర్లతో పోలిస్తే తన అభిప్రాయం వేరుగా ఉండొచ్చని ఐతే వారిని విమర్శించడం తన పని కాదన్నారు. భారత్‌లో పేస్‌బౌలర్ ఆల్‌రౌండర్లు లేర ని అయితే దేశం తనకన్నా మెరుగైన 100 మంది కపిల్‌దేవ్‌లను తయారు చేయాలని కోరుకుంటు న్నట్లు తెలిపారు. కాగా స్పిన్నర్లు అశ్విన్, జడేజా మంచి ఆల్‌రౌండర్లుగా ఎదిగారని కపిల్ అన్నారు.