- బీసీసీఐకి లేఖ రాసిన దక్షిణాఫ్రికా బోర్డు
ముంబై : ఈ ఏడాది డిసెంబర్‌లో టీమిండియా దక్షిణాఫ్రికా లో పర్యటించడంపై వెంటనే స్పష్టత ఇవ్వాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) బీసీసీఐకి లేఖ రాసింది. బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిని ఉద్దేశించి రాసిన ఈ లేఖలో డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ఆడే విధంగా భారత్ తమ పర్యటనను ఖరారు చేయాలని సీఎస్‌ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హరూన్ లొర్గాత్ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తికి మరో హెచ్చరికను కూడా సీఎస్‌ఏ జోడించింది. ఈ సీరీస్‌లో పాల్గొంటేనే వచ్చే ఐపీఎల్‌లో ఆడేందుకు తమ ఆటగాళ్లను అనుమతి ఇస్తామన్నట్లుగా కూడా పరోక్షంగా హెచ్చరించింది. అయితే దీనిని జోహ్రి తేలిగ్గా కొట్టి పారేశా రు. లేఖ తమకు అందిందని నిర్ధారించిన ఆయన సరైన సమయంలోనే దానికి స్పందిస్తామ న్నారు. ‘‘మేం దానిని అసలు పట్టించుకోం. ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని మేం భావించడం లేదు. మే 8 వరకే ఈ ఐపీఎల్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటారనే విషయం ముందుగానే అందరికీ తెలిసిన విషయమని, అందుకే వాళ్లంతా (దక్షిణాఫ్రికా ఆటగాళ్లు) వెళ్లిపోయారు. ఈ సమయంలో రచ్చ అనవసరం’’ అని జోహ్రి వ్యాఖ్యానించారు. చాం పియన్స్ ట్రోఫీ తర్వాత భారత్ పాల్గొనే సీరీస్‌ల విషయంలో ఇంకా తమకు స్పష్టత రాలేదు. సీఎస్‌ఏ కోరుతున్న సీరీస్ ఇంకా చర్చల దశలోనే ఉంది. అయితే గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడాల్సి ఉండగా... ఆ జట్టు స్థానంలో న్యూజిలాండ్ భారత పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.