లండన్ : భారత మాజీ క్రికెటర్, హైదరాబాదీ స్టైలీస్ట్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు అరుదైన గౌర వం దక్కింది. ప్రఖ్యాత మార్లేబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో ఈ హైదరాబాది సొగసరి బ్యాట్స్ మన్‌కు జీవితకాల గౌరవ సభ్యత్వం లభించిం ది. ఈ ప్రతిష్ఠాత్మక ఎంసీసీ క్లబ్‌లో ఇప్పటికే మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, వీరేంద్రసెహ్వాగ్, జీహ ర్‌ఖాన్ భారత్ తరఫున సభ్యత్వం పొందిన వారి లో ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లా డుతూ... ప్రతిష్ఠాత్మక, చరిత్రాత్మక క్రికెట్ క్లబ్ లో సభ్యునిగా ఎంపిక కావడం నిజంగా ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. క్లబ్‌కు ఉన్న గొప్ప వారసత్వాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. అద్భుతమైన సంస్కృతి కలిగిన క్లబ్‌లో భాగమవు తున్న నేను క్లబ్ ఖ్యాతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. 42 ఏళ్ల లక్ష్మణ్ 134 టెస్టుల్లో 45.97 సగటుతో 8,781 పరుగులు సాధించగా... తాను ఆడిన 85 వన్డేల్లో 30.76 సగటుతో 2,338 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మార్గనిర్దేశకుడిగా వ్యవహరిస్తున్నాడు.