- వృద్ధిమాన్ సాహా మెరుపు ఇన్నింగ్స్
- రాణించిన గుప్తిల్, మ్యాక్స్‌వెల్
- పంజాబ్ బౌలర్ల సమష్టి కృషి
- తుదికంటా పోరాడిన ముంబై బ్యాట్స్‌మెన్
- 7 పరుగుల తేడాతో తప్పని ఓటమి
- పొలార్డ్, సిమన్స్ అర్ధ శతకాలు వృథా
ముంబై : సొంతగడ్డపై ముంబైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గురువారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆఖరు వరకు పోరాడి ఓడింది. ఆఖరు బంతి వరకు అలుపెరుగక పోరాడిన పొలార్‌డ ముంబైని ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. నిర్ణీత 20 ఓవర్ల లో 223 పరుగులు మాత్రమే చేసిన ముంబై ఏడు పరుగులు తేడాతో ఓటమి పాలైంది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ సాహా (93 నాటౌట్ : 55 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో 3 వికెట్లకు 230 పరుగులు చేసింది. దీంతో 231.. పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై కూడా ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభిం చింది. ఓపెనర్లు లెండిల్ సిమన్స్ (59), పార్థివ్ పటేల్ (38) గట్టి పునాది వేశారు. వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సక్సెస్‌ఫుల్‌గా దూ సుకుపోతున్న క్రమంలో మోహిత్ శర్మ వేసిన తొమ్మిదో ఓవర్ తొలి మూడు బంతులను వరుసగా బౌండరీలు బాదిన పార్థీవ్ నాలుగో బంతికి వోహ్రా చేతికి చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 99 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం స్వల్ప వ్యవధిలోనే సిమన్స్ కూడా మాక్స్‌వెల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులో ఉన్న నితీశ్ రానా (12), రోహిత్ శర్మ (5) పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జట్టు స్కోరు 119 వద్ద రాహల్ తెవాటియా బౌలింగ్‌లో రోహిత్ వికెట్ చేజార్చుకోవడంతో ముంబై ఓట మి ఖాయమైనట్లు తేలిపోయింది. ఇలాంటి సమయంలో క్రీజులో ఉన్న పొలార్‌డ, హార్డిక్ పాండ్య తమ సత్తా చాటారు. హెన్రి వేసిన 16వ ఓవర్లో పొలార్‌డ, పాండ్యా చెరో రెండు సిక్స ర్లు బాదడంతో 27 పరుగులు వచ్చాయి. పరాజయం ఖాయమనుకున్న ముంబై మళ్లీ రేసు లోకి తీసుకొచ్చారు. సందీప్ శర్మ వేసిన 17వ ఓవర్ రెండో బంతికి హార్డిక్ పాండ్య (30) ఔటయ్యాడు. మరో ఎండ్‌లో పోరాడుతున్న పొలార్‌డకు కర్‌ణశర్మ (19) కూడా తోడవడంతో ముంబైకి గెలుపుపై ఆశలు రేకెత్తాయి. ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో పొలార్‌డ (50 నాటౌట్), హర్భజన్‌సింగ్ (2) ఉన్నారు. మోహిత్ శర్మ అద్భుత బౌలింగ్‌తో ముంబై 8 పరుగులు మాత్రమే చేయడంతో పంజా బ్‌ను విజయం వరించింది. పంజాబ్ బౌలర్లలో మోహిత్ శర్మ రెండు, సందీప్ శర్మ, అక్షర్ పటేల్, మాక్స్‌వెల్ తెవాటి యా తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ కోల్పోయిన పం జాబ్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (36), సాహా రెచ్చిపోయా రు. ఆరంభం నుంచే భారీ షాట్లతో చెలరేగిన ఈ జోడీ మలింగ బౌలింగ్‌ను చిత్తు చేశారు. అయితే కర్‌ణ శర్మ బారిన పడ్డ గప్తిల్ పెవీలియన్‌కు చేరగా... సాహాతో మ్యాక్స్‌వెల్ జత కలిసాడు. వీరిద్దరు విజృంభించి బ్యాటింగ్ చేశారు. హర్భజన్‌సింగ్ వేసిన 9వ ఓవర్లో మూడు సిక్సర్లు బాదిన మాక్స్‌వెల్ 21 పరుగులు రాబట్టాడు. దీంతో 9 ఓవర్లకే పంజాబ్ 121 పరుగులు సాధించింది. బుమ్రా వేసిన 11వ ఓవర్ ఆఖరి బంతికి మాక్స్‌వెల్ బౌల్డయ్యాడు. తర్వాతి ఓవర్లో సాహా అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన షాన్ మార్‌ష అంతగా ఆకట్టుకోనప్పటికీ మరో ఎండ్‌లో ఉన్న సాహా జోరు తగ్గించకుం డా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మెక్లనగన్ వేసిన 16వ ఓవర్లో మార్‌ష (25) వెనుది రిగాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోరు 190కి చేరిన క్రమంలో క్రీజులోకి వచ్చి న అక్షర్ పటేల్‌తో కలిసిన సాహా పంజా బ్‌కు 230 స్కోరు అందించి 93 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. సాహాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.