హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ః చేనేత రంగంలో కొత్త పథకాలకు త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. జిల్లాకు ఒకటి చొప్పున వీటిని ప్రారంభోత్సవాలు జరపాలని ప్రభుత్వం బావిస్తుంది. ఈ మేరకు కార్యచరణను సిద్ధం చేస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసు కోనుంది. జూన్ రెండవ తేదీన తెంలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరిచుకుని గత మార్చి 31 చేనేత కార్మికులకు అందించే ప్రభుత్వ సాయా న్ని నేరుగా కార్మికుల ఖాతాల్లోనే జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయి ంచింది. ఆధార్, బయోమెట్రిక్ ఆధారంగా రాయితీ డబ్బులు నిజమైన చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడానికి నిర్ణయించారు.
తెలంగాణ ప్రభుత్వం అంతరించి పోతున్న కుల వృత్తులకు చేయూతనిచ్చే విధంగా బడ్జెట్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. ఈఏడు రాష్ట్ర బడ్జెట్‌లో కనీవినీ ఎరుగని పద్ధతిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా చేనేత కార్మికుల సం ేమం కోసం రూ.1200 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో నిధుల కేటాయింపుల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండడానికి అధి కారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా జిల్లాలో చేనేత జౌళిశాఖ అధికారులు ముందుగా చేనేత కార్మికుల కుటుంబాల గణన కార్యక్రమం చేపట్టారు. వీరిలో చేనేత వృత్తిపై ఆధారపడిన వారి జాబితాను ప్రత్యేకంగా రూపొందించారు. జిల్లాలో మగ్గాలు ఉన్న చేనేత కార్మికుల కుటుంబాలను గుర్తించారు. చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశారు. దీంతో జిల్లాలోని చేనేత మగ్గాలు, చేనేత కార్మికుల సంఖ్య, వారి ఉత్పాదక సామర్థ్యం ఎంత అనే అంశాలతో చేనేత జౌళిశాఖ అధికారులు పూర్త్తిస్థాయి నివేదికను రూపొందించనున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 5 వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 180లకు గాను 16 మగ్గాలకు జియోట్యాగింగ్ పూర్తయింది. చేనేత కార్మికుల కుటుం బాలను కాపాడుకోవడమే ప్రధాన ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం నూతన చేనేత విధానాన్ని ప్రవేశపెట్టింది. చేనేత రంగంలో లాభదాయకత వచ్చేలా నూతన రకాల వస్త్రాలు తయారు చేయడంలో చేనేత కార్మికులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది. శిక్షణతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఒక వేల చేనేత రంగంలో లాభదాయకత లేదని ఇతర రంగాలకు తరలి వెల్లాలనుకునే చేనేత కార్మికులకు కూడా చేయుతను అందించడానికి రాయితీలతో కూడిన రుణాలు అందివ్వడానికి ప్రభుత్వం వివిధ రకాల పథ కాలకు త్వరలో శ్రీకారం చుట్టనుందని మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటించారు. చేనేత కార్మికులకు రాయితీలు ఇస్తూనే వారి నుంచి ఉత్పత్తులను కోనుగోలు చేయడానికి, బయట మార్కెట్టులో విక్రయించడానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించనుంది. ఒక రకంగా ప్రభుత్వం ప్రస్తుతం కోనసాగుతున్న మాస్టర్ వీవ ర్ పాత్రను పోషించనుంది. దీంతో చిన్న చేనేత కార్మికులకు మరింత ప్రయో జనం కలుగనుంది.
గతంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం అనేక రకాల పథకాల ద్వారా రాయి తీలు అందించినప్పటికి అవి కేవలం మాస్టర్ వీవర్స్‌కు, సంఘాలకే పరిమితం కావడంతో ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీ డబ్బులు చిన్న చిన్న చేనేత కార్మి కులకు చేరేవి కావు. దీంతో చేనేత కార్మికులు పస్తులు ఉండాల్సిన పరిస్థితులలో గత్యంతరం లేక మహారాష్ట్ర, బాంబే, లాతూర్, బీవండీ తదితర ప్రాంతాలకు వలసవెళ్లేవారు. ప్రస్తుతం నూతన పాలసీ ప్రకారం నేరుగా రాయితీ డబ్బులు చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతోపాటు మగ్గాలకు జియో ట్యాగింగ్ చేయడం, ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల అర్హులకే నేరుగా రాయితీలు అంది నిజమైన చేనేత కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. చేనే త కార్మికులకు స్వయం సంవృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్మికుడే యజమాని పేరిట కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. చేనేత మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కొత్త పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద కార్మికులకు మగ్గాలను పంపిణీ చేయడంతోపాటు వర్‌కషెడ్‌ల నిర్మాణాలను ప్రభుత్వం సహాయం అందించనుంది. ఈపథకం పై త్వరలో ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేయనుంది. తెలంగాణలోనే అధిక శాతం నేత కార్మికులు ఆసా ముల వద్ద మరమగ్గాలపై పని చేస్తూ కూలీ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల సమగ్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కార్మికులకు మగ్గాలను పంపిణీ చేసి యజమానులుగా మార్చాలని నిర్ణయించింది.
ఈ పథకం కింద ఒక్కొ కార్మికుడికి నాలుగు మగ్గాలను ఇస్తారు. స్వంతంగా వర్క్ షెడ్‌ను నిర్మించుకునేందుకు సాయం చేయనున్నారు. ఐదుగురి కార్మికులతో ఒక బృందం ఏర్పాటు చేయనున్నారు. వీరికి 20 మగ్గాలు, 5 వర్క్‌షెడ్‌లను ఒక యూనిట్ కింద మంజూరు చేయనున్నారు. వర్క్ షెడ్‌లో కార్మికుడు స్వంత మగ్గాలతో వస్త్రాలు ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయనుంది. ఇందుకోసం జిల్లాకు సహకారం సంఘం(టెక్స్‌టైల్స్ కాంప్లెక్స్ సొసైటీ సమన్వయ సంస్థ) నోడల్ ఏజెన్సీగా నియమించునున్నారు. ఇక కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోనుంది. మొదటి దఫాగా రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల మందికి మగ్గాలు మంజూరు చేయనుంది. ప్రభుత్వం గుర్తించిన నిరుపేద కార్మికులు లబ్ధి పొందనున్నారు.