హైదరాబాద్, మేజర్ న్యూస్‌ః అత్యున్నత న్యాయ స్థాల్లో, న్యాయవ్యవస్థలో కుల వివక్షత, అణిచివేత, అంటరానితనానికి, కుల వేధిపంలకు వ్యతిరేకంగా మనువాద జ్యుడిషియల్ ఆధిపత్యంపై దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని న్యాయవ్యవస్థలో తీవ్రస్థా యిలో చేస్తున్న తమిళ ద్రావిడ పోరాట యోధుడు, పశ్చిమబెంగాల్ రాష్ట్ర కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ యావత్‌భారతీయ దళితుల బాహుబలి అని దళిత బహుజన పార్టీ ప్రకటించింది. నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాబి.ఆర్. అంబేద్కర్ తరు వాత తొలిసారి దళితుల గళం న్యాయవ్యవస్థలో వినిపించారన్నారు. అవినీతిని ప్రశ్నించినందుకు జస్టిస్ కర్ణన్‌పై వేధింపులు, మానవహక్కుల ఉల్లం ఘనేనని, ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం - 1989, 2015 పరిధిలోకి వస్తుందన్నారు. కోర్టు ధిక్కారం ముసుగులో కర్నన్ జైలు శిక్ష విధిం చడం మనువాదుల తీర్పుగానే భావిస్తున్నా మన్నారు. ఈ శిక్షలను దళితులు వ్యతిరేకించారని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఆరోపణ జడ్జీలు రాజ్యాంగ పరిధిని ఉల్లంఘించారని ఆరోపించారు. జస్టిస్ కర్ణన్ ఆదేశాలు అమలు కోసం భారత రాష్ట్ర పతి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారత పార్లమెంట్‌లో కర్ణన్ ఫిర్యాదులపై చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత జడ్జీల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తే దళితులు తిరగబడాలని కోట్లాది అణగారిన కులాలకు పిలుపునిచ్చారు. దళిత ఎం.పి.లు, కేంద్రమంత్రులు, మేధావివర్గం, దళిత న్యాయాధికారులు స్పందించాలని ఆత్మగౌరవ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రెస్‌మీట్ కార్యక్రమంలో పార్టీ రాష్‌ట్ర కార్యదర్శిలు చేపూరి రాజు, షేక్ బాషా, ఆలిండియా ఎస్‌సి., ఎస్.టి. అడ్వకేట్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సిలివేరి వసంతరావు, కార్యదర్శి ఎ. ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.