హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ః తెలుగుదేశం పార్టీ నేతలు ప్రధాని నరేంద్రమోదీని తిట్టేందుకు ధైర్యం చాలక తమ పార్టీ అధినాయకుడిపై విమర్శలు చేస్తున్నారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయానన్న భయ ం చంద్రబాబును ఇంకా వెంటాడు తోందని చెప్పారు. మంత్రి నారాయణ కుమారుడు చని పోతే ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు జగన్‌ను విమర్శించడంలో బిజీగా ఉన్నారని, వాళ్ల తీరు చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని ఆమె చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రి మోదీని జగన్ కలిస్తే తెలుగుదేశం పార్టీ నేతలకు ఎందుకంత ఉలికిపాటని రో జా ప్రశ్నించారు. చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకునే రకం కా దని, జగన్ స్వయంగా పట్టపగలే ఎంపీలతో కలిసి వెళ్లి చంద్రబాబు అవి నీతిపై ప్రధానికి అన్ని ఆధారాలు ఇచ్చారని ఆమె చెప్పారు. అమెరికాలో ఉన్న చంద్రబాబు టెన్షన్‌తో ఏం చేయాలో తెలియక తమ పార్టీ నేతలతో దీనిపై విమ ర్శలు చేయిస్తున్నారన్నారు.