హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ః తెలంగాణలో బీసీ ఫెడరేషన్లు ఎత్తివేసే ప్రయత్నాలు మానుకో వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం బీసీ ఫెడరేషన్ల సంక్షేమ సంఘం కన్వీనర్ మొగిలిచర్ల వీరన్న అధ్యక్షతన బీసీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కృష్ణ య్య మాట్లాడుతూ పోరాటాల ఫలితంగా ఏర్పా టు చేసిన ఫెడరేషన్లను ఎత్తివేస్తే సహించేది లేదన్నారు. రజక, నాూబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500కోట్లు కేటాయించిన ప్రభుత్వం మిగిలిన 9 ఫెడరేషన్లకు ఎందుకు నిధులను కేటాయించడం లేదని ప్రశ్నించారు. ఎంబీసీలకు రూ.1000 కోట్లు కేటాయించినా.. అవి ఏ ఏ వర్గాలకు, కులాలకు ఎంతెంత కేటాయించే అంశాలపై స్పష్టత లేకపోవడం విచారకరమన్నారు. ఫెడరేషన్లకు జనాభా దామాషా ప్రకారం రూ.100 కోట్ల నుంచి రూ.400కోట్లు కేటాయి ంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు బెట్టే ప్రయత్నాలు చేయవద్దని, బీసీలు ఐక్యంగా తమ హక్కుల సాధనకోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ నేతలు పురు షోత్తం, సాయికుమార్, లక్ష్మీగౌడ్, జ్వలిత, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.